రత్తాలూ.. మరీ ఇంతగా రెచ్చిపోవాలా?

0బాలీవుడ్ లో తనకు పర్మనెంట్ సీట్ వేసుకోవడానికి సౌత్ బ్యూటీ రాయ్ లక్ష్మి బాగానే కష్టపడుతోంది. ఏ చిన్న అంశాన్ని వదిలిపెట్టకుండా తన బాలీవుడ్ అరంగేట్ర మూవీ జూలీ2 కోసం తెగ కష్టపడిపోతోంది. థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న జూలీ2 మూవీలో.. తన అందచందాలను పరవడంలో.. ఏ మాత్రం వెరవలేదు టాలీవుడ్ రత్తాలు.

ముందుగా అనుకున్న షెడ్యూల్ కంటే కాసింత ఆలస్యం అయినా.. ఎట్టకేలకు జూలీ2 థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. అక్టోబర్ 6న ఈ చిత్రం విడుదల కానుండగా.. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్.. ట్రైలర్ విపరీతమైన ఆసక్తి కలిగిస్తున్నాయి. అలాగే సోషల్ మీడియాలోనూ.. పబ్లిసిటీ యాక్టివిటీస్ లోను రాయ్ లక్ష్మి తెగ రెచ్చిపోతోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఓ టీజర్ లో అయితే ఏకంగా టాప్ లెస్ లో దర్శనం ఇచ్చేసే ధైర్యం చేసేసింది ఈ బ్యూటీ. ఓ సాయం కాలం.. సూర్యుడు అస్తమించేందుకు కొంచెం ముందు.. సముద్రపు ఒడ్డున సేద తీరుతూ ఫోటోలకు పోజులు ఇస్తున్న రాయ్ లక్ష్మి కనిపిస్తుంది.

టాప్ లెస్ పోజ్ ఇచ్చేసే ధైర్యం చేయడమే ఈ ఫోటో ప్రత్యేకత. బాలీవుడ్ కోసం తను చాలా కష్టపడ్డానని రాయ్ లక్ష్మి చెప్పింది కానీ.. మరీ ఇంతగా టాప్ లెస్ అని జనాలు ఎక్స్ పెక్ట్ చేయలేదు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జూలీ2 చిత్రం కోసం తాను 96 రకాల ఔట్ ఫిట్స్ తో కనిపిస్తానని చెప్పింది. ఇప్పటికి జనాలకు కనిపించినవి.. చూపించినవి కొన్నే. మరి మూవీలో ఇంకెన్ని యాంగిల్స్ లో పరువాల ప్రదర్శన ఉంటుందో?Laxmi-Raai-Goes-Topless-in-