ఖైదీతో స్పీడు పెంచిన ఐటెం భామ

0Laxmi-Raai-in-Khaidi-No-150-Item-songరాయ్ లక్ష్మీ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. ఫిలిం ఇండస్ట్రీలో పదేళ్లకు పైగా అనుభవం ఉన్న ఈ భామ.. ప్రస్తుతం కెరీర్ పీక్ స్టేజ్ లో ఉంది. సౌత్ లోని అన్ని భాషల్లోను కలిపి ఇప్పటివరకూ 50కి పైగా సినిమాలు చేసేసింది కానీ.. ఈ భామకు రావాల్సిన బ్రేక్ మాత్రం ఇప్పటికి వచ్చింది.

తాజాగా రిలీజ్ అయిన మెగాస్టార్ కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150లో.. ‘రత్తాలు రత్తాలు’ ఐటెం సాంగ్ తర్వాత.. రాయ్ లక్ష్మీ పేరు మార్మోగిపోతోంది. అమ్మడి మత్తెక్కించే అందాలు.. వేడెక్కించే స్టెప్పులు.. రాయ్ లక్ష్మీకి తెగ క్రేజ్ తెచ్చిపెట్టేస్తున్నాయి. అలాగే కెమేరాలకు పోజులు ఇవ్వడంలో కూడా ఈ భామ ఎలాంటి మొహమాటాలు పెట్టుకోదు. తాజాగా క్లీవేజ్ అందాలు.. నాభి సొగసులు చూపిస్తూ.. లెహంగాతో అమ్మడు ఇచ్చిన ఓ పోజ్.. కుర్రకారుకు మతి పోగొట్టేస్తోంది. తన వంపులు వయ్యారాల ప్రదర్శనతో మిసమిసలాడే అందాన్ని చూపించేస్తోంది రాయ్ లక్ష్మి.

ఖైదీ నంబర్ 150కి ముందు సర్దార్ గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ తో ‘తోబ తోబ’ అంటూ ఆడిపాడింది. వరుసగా మెగా మూవీస్ లో ఐటెం సాంగ్స్ తో అలరించడంతో అమ్మడికి టాలీవుడ్ లో తెగ క్రేజ్ వచ్చేస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో జూలీ2 అంటూ ఓ బోల్డ్ మూవీలో కూడా యాక్ట్ చేస్తున్న ఈ భామ చేతిలో.. ప్రస్తుతం అర డజన్ కు పైగా సినిమాలు ఉన్నాయంటే.. రాయ్ లక్ష్మి స్పీడ్ అర్ధమవుతుంది.