ఇదేం గ్రంథం బాబోయ్

0

ఏంటో రాను రాను టాలీవుడ్ లో సినిమాల టీజర్లు కొత్త పోకడలు పోతున్నాయి. ప్రమోషన్ లో అతి కీలకంగా భావించే ఈ క్రమాన్ని కొందరు చక్కగా వాడుకోగా మరికొందరు అయోమయాన్ని వివాదాన్ని సృష్టించేందుకు ఉపయోగించుకుంటారు. లక్ష్మీస్ వీరగ్రంధం రెండో క్యాటగిరీలోకి వచ్చేలా ఉంది. రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ కు పోటీగా దానికి పూర్తి విరుద్ధమైన బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న లక్ష్మీస్ వీరగ్రంథం టీజర్ ఇందాకా విడుదల చేసారు. ఒకటి సరిపోదు అనుకున్నారేమో రెండు మూడు వదిలారు. అన్నింటిలోనూ కామన్ గా చూపించింది ఒకటే.

లక్ష్మి భారతి అనే ఆవిడ వల్ల రాష్ట్రాన్ని పాలించే ఓ పెద్దాయన ఎలా పతనమయ్యాడు అసలు ఆవిడ పూర్వ జీవితంలో ఏం జరిగింది అని. కాకపోతే పాత్రధారులను రివీల్ చేయకుండా బ్లర్ చేసిన షాట్స్ లో కేవలం బ్యాక్ గ్రౌండ్ లో డైలాగ్స్ వినిపించేసి మమ అనిపించారు. చివర్లో దర్శక నిర్మాత కేతినేని జగదీశ్వర్ రెడ్డి ఫోటోను మాత్రం స్పష్టంగా చూపించారు. అయితే ఒకటి మాత్రం స్పష్టం. లక్ష్మి పార్వతికి ఎన్టీఆర్ తో వివాహం కాకముందు పూర్వ జీవితంతో పాటు ఆయనతో పెళ్లయ్యాక జరిగిన పరిణామాలు కాన్సెప్ట్ తీసిన ఈ మూవీలో అంతా ఆమెకు వ్యతిరేకంగా ఉన్న మాట వాస్తవం.

మరి లక్ష్మి పార్వతిని ఇంత నెగటివ్ గా చూపించే ప్రయత్నం చేసినప్పుడు ఆవిడ ఊరుకుంటారా. వర్మ లక్ష్మిస్ ఎన్టీఆర్ కు ఆవిడ అనుమతి తీసుకుని ఆమెతోనే ఓపెనింగ్ చేయించుకున్నాడు. కానీ లక్ష్మీస్ వీరగ్రంధం కేసు వేరు. టైటిల్ లోనే చాలా తేడా ఉంది. మరి ఇది విడుదల అవుతుందా అనే అనుమానాలు రావడం సహజం. ఒకపక్క అసలైన ఎన్టీఆర్ కథానాయకుడు ఫెయిల్ కాగా ఇప్పుడీ కొసరు లక్ష్మీస్ వీర గ్రంధం లక్ష్మీస్ ఎన్టీఆర్ లు ఏ మేరకు జనానికి కనెక్ట్ అవుతాయో చూడాలి.
Please Read Disclaimer