లీడర్ 2 కథ రాబోతోందా?

0shaker-kamula-and-ranaశేఖర్‌ కమ్ముల ‘ఫిదా’తో విజయాన్ని సొంతం చేసుకొని మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు అందరి కళ్లూ ఆయన చేయబోయే తదుపరి సినిమాపైనే. కొత్తవాళ్లతో ఓ సినిమా చేయబోతున్నారని, కాదు కాదు… ఓ స్టార్‌ కథానాయకుడి కోసం కథ సిద్ధం చేస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ జనాలు మాట్లాడుకొంటున్నారు. అయితే గత కొన్ని రోజులుగా మరో కొత్త కబురు వినిపిస్తోంది. ‘లీడర్‌’కి సీక్వెల్‌ కథని సిద్ధం చేస్తున్నారని, అందులో కూడా రానానే నటించబోతున్నారని ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఆ సినిమా తెరకెక్కబోతోందని, ఆ తరహా చిత్రం రాజకీయ వేడి ఉన్నప్పుడు వస్తేనే బాగుంటుందనుకొన్న శేఖర్‌ కమ్ముల ఆ దిశగా సినిమాని పట్టాలెక్కించడానికి సిద్ధమవుతున్నట్టు తెలిసింది. రానా నటించిన తొలి చిత్రం ‘లీడర్‌’ విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు అందుకోవడంతోపాటు, ఓ ప్రత్యామ్నాయ చిత్రంగా ప్రేక్షకుల మెప్పు కూడా పొందింది.