సల్మాన్ ను నాకు వదిలేయండి: కత్రినా

0


Katrina-Kaif-Salman-Khan-IIసల్మాన్ ఖాన్ – కత్రినా కైఫ్ మధ్య అప్పట్లో బోలెడంత వ్యవహారం నడిచిందని టాక్ ఉంది. కేట్ ఈ స్థాయికి చేరుకోవడంలో సల్మాన్ సాయం కూడా చాలానే ఉంటుంది. అయితే.. ఆ తర్వాత వీరిద్దరు విడిపోవడం.. ఎవరి దారి వారు చూసుకోవడం జరిగాక.. మళ్లీ ఇప్పుడు కలిసిపోయారు.. కలిసి సినిమా కూడా చేసస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో టైగర్ జిందాహై మూవీ కూడా రానుంది.

రీసెంట్ గా ఐఫా ప్రెస్ మీట్ లో సల్మాన్ ఖాన్- కత్రినా కైఫ్ జంట కలిసి చక్కర్లు కొట్టింది. వీరికి యంగ్ సెన్సేషన్ ఆలియా భట్ కూడా తోడైంది. ముగ్గురూ కలిసి మీడియా ముందు హంగామా చేసి పడేశారు. కత్రినా ఏం మాట్లాడినా మధ్యలో అడ్డు తగిలి మరీ ఇంకోటేదో చెప్పాడు సల్మాన్. అలా సల్మాన్ అడ్డుపడుతున్నా.. ఆయన ఎంతో ప్రేమ కురిపిస్తాడని చెప్పింది కత్రినా కైఫ్. దీనికి కూడా సల్మాన్ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. తన హ్యూమర్ స్టైల్ గొప్పగా ఉంటుందని.. చెడుగా ఉండదని అన్నాడు. అంతే కాదు ఐఫా వేడుకల తర్వాతి రోజు కత్రినా బర్త్ డే కావడంతో.. ఆ రోజు కత్రినా డే అవుతుందని కూడా అన్నాడు సల్లూ భాయ్.

అయితే.. సల్మాన్ తో పని చేస్తారా అని ఆలియా భట్ ను అడిగితే దానికి కేట్ ఇచ్చిన సమాధానమే చాలామందిని ఆశ్చర్యపరిచింది. ‘ఆలియాను వరుణ్ ధావన్ కు.. సల్మాన్ ను నాకు వదిలేయండి’ అని ఓపెన్ గానే చెప్పేసింది కత్రినా కైఫ్. ఇక వెకేషన్స్ కోసం కత్రినా వెంట వెళ్తానని ఆలియా చెబితే.. తాను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి కేట్ వస్తుందని సల్మాన్ చెప్పడం విశేషం.