ఇద్దరి ఫ్యూచర్ ను డిసైడ్ చేసే ఒక్క సినిమా!

0legend-balakrishna-boyapatiఏడాది గ్యాప్ తర్వాత నందమూరి బాలకృష్ణ మళ్లీ స్ర్కీన్ పై అదరగొట్టబోతున్నాడు. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య.. ‘లెజెండ్’గా వచ్చేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఈ మూవీ దర్శకుడు బోయపాటి కెరీర్ కు చాలా కీలకమైంది. ఎన్టీఆర్ తో తీసిన ‘దమ్ము’సినిమా భారీ డిజాస్టర్ గా మారింది. దీంతో కాస్త డీలా పడ్డా బోయపాటి ‘లెజెండ్’ సినిమాతో మరోసారి తనేమిటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఈ మధ్య హిట్ లేని బోయపాటికి ఇప్పుడు కచ్చితంగా ఓ హిట్ కావాలి. అప్పుడే ఇండస్ట్రీలో నిలబడగలుగుతాడు. అందుకే ‘లెజెండ్’ మూవీపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు.

‘లెజెండ్’ మూవీ బాలయ్యకు కూడా ముఖ్యమైనదే. బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన ‘సింహా’ తర్వాత ఒక్క హిట్ కూడా లేకపోవడంతో ఓ భారీ సక్సెస్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. పైగా వచ్చే ఎన్నికల్లో బాలయ్య ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టే విధంగా బాలయ్య కొత్త సినిమా ఉండబోతోందని సమాచారం. ఈ సినిమా హిట్టయితే బాలయ్య రాజకీయ రంగ ప్రవేశం అదిరిపోతుంది. అందుకే సింహా సినిమాను మించిన బ్లాక్ బస్టర్ కొట్టాలని బాలయ్య ఫిక్సయ్యారు.

‘సింహా’తో బాక్సాఫీస్‌ని రూల్ చేసిన బాలయ్య, బోయపాటి కలిసి మరోసారి ఆ ఫీట్‌ని రిపీట్ చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ మూవీ హిట్ అయి వీరిద్దరికి లైఫ్ ని ఇస్తుందా.. ? వెయిట్ ఆండ్ సీ..!