పిక్ టాక్ : ఎన్టీఆర్ కు భార్యపై ఇంత అభిమానం

0

తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేని పేర్లు ఎన్టీఆర్ బసవతారకం. తెలుగు వారి ఆరాధ్య నటుడిగా వెలుగు వెలిగిన ఎన్టీ రామారావు ఆ తర్వాత సీఎంగా తెలుగు ప్రజల హృదయాలు గెలుచుకున్నాడు. తెలుగు ప్రజల మనసుల్లో చిరస్మరణీయంగా నిలిచే ఎన్టీఆర్ కు తన భార్య బసవతారకం అంటే పంచ ప్రాణాలు అంటూ ఆయన సన్నిహితులు అంటూ ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయిన ఈ ఫొటోను చూస్తే ఆ విషయం నిజమే అని అర్థం అయిపోతుంది.

బసవతారకం చనిపోయిన తర్వాత ఆమె ఫొటోను దేవుడి విగ్రహాల పక్కన పెట్టి మరీ ఎన్టీఆర్ పూజించేవారు. తనను వదిలి వెళ్లిపోయిన భార్య జ్ఞాపకార్థం ఆమె పేరుపై పలు సేవా కార్యక్రమాలు కూడా ఎన్టీఆర్ నిర్వహించారు. 1985లో క్యాన్సర్ తో చనిపోయిన బసవతారకం పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్ ను నిర్మించారు. ఇప్పటికి కూడా హైదరాబాద్ లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉన్న విషయం అందరికి తెల్సిందే.

మామ కూతురు అయిన బసవతారకంను ఎన్టీఆర్ 1942లో వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో ఇద్దరు కూడా చిన్న వయస్సులోనే ఉన్నారు. వీరికి 8 మంది కొడుకులు 4 కూతుర్లు జన్మించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ ‘ఎన్టీఆర్’ రూపొందుతుంది. ఆ చిత్రంలో బసవతారకం పాత్రను విద్యా బాలన్ పోషిస్తోంది. బసవతారకం గురించిన మరిన్ని విషయాలను ఈ చిత్రంలో చూపించే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.
Please Read Disclaimer