ప్రాణహాని ఉందంటున్న రేవంత్ రెడ్డి

0

తనకు ప్రాణహాని ఉందని , తగిన రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నాడు కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి . తెలంగాణ ప్రభుత్వం పట్ల , కేసీఆర్ పట్ల సింహస్వప్నం లా మారిన రేవంత్ రెడ్డి ని కొంతమంది అదేపనిగా టార్గెట్ చేస్తున్నారట ! దాంతో ఇంటలిజెన్స్ వర్గాలు ఆమధ్య రేవంత్ ని హెచ్చరించారట . తగిన భద్రతా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారాట . అయితే తాజాగా తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు సమీపించినందున తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి రంగంలోకి దిగాడు రేవంత్ రెడ్డి . తనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఇబ్బందులు తప్పవని ,అలాగే వాళ్ళు కల్పించే భద్రత నాకు అవసరం లేదని అలాగే నమ్మకం కూడా లేదని కావున కేంద్ర ప్రభుత్వమే నాకు సరైన భద్రత కల్పించాలని కోరుతున్నాడు రేవంత్ రెడ్డి .

మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నుండి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించడానికి మరోసారి పోటీ పడుతున్నాడు అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలో దిగనున్నాడు రేవంత్ . కేసీఆర్ ప్రభుత్వం పై ఒంటికాలు మీద లేచే రేవంత్ అంటే కొంతమంది తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులకు ఒళ్ళు మంట అందుకే రక్షణ కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ని ఆశ్రయించాడు రేవంత్ రెడ్డి . తెలంగాణలో డిసెంబర్ 7న పోలింగ్ కాగా డిసెంబర్ 11న ఫలితాలు వెలువడనున్నాయి .




Please Read Disclaimer