అల్లుడికి లాకు పెట్టిన మారుతి

0ఇది మూతి ముద్దుల కాలం… రెండు జతల లిప్పులను జస్ట్ లాక్ చేస్తే రొటీన్ అనుకుంటున్న కొత్త తరం ఫిలిం మేకర్స్ జిమ్నాస్టిక్ ముద్దులు ‘జలేబి’ కిస్సులతో శృంగారం హద్దులు చెరిపేస్తున్నారు. ఇక ఇంతమంది ఇలా విరుచుకుపడుతుంటే చిన్నప్పుడే బూతు ట్యాగ్ తెచ్చుకుని దాన్ని వదిలించుకోవడానికి నానా తంటాలు పడ్డ డైరెక్టర్ మారుతి ఊరుకుంటాడా?

అందుకే శైలజా రెడ్డి కూతురికి అల్లుడికి మధ్య ఓ ఘాటు కిస్సును పెట్టాడట. ఘాటు అంటే మరీ విజయ్ దేవరకొండ లాగా కరువుప్రాంతం కిస్సులు కాదు. క్లాసు కిస్సు. అక్కినేని వారి స్టైల్ లో రొమాంటిక్ కిస్సు. ఫస్ట్ హాఫ్ అంతా హీరోను ఈగో తో చంపిన అను సెకండ్ హాఫ్ కు ముందు ఈ కిస్సుతో చైతుకు కాస్త ఉపశమనం ఇస్తుందట. అంటే ఈ లిప్ లాకు స్టొరీకి అవసరమట!

ఇప్పటి ట్రెండ్ ను బట్టి కిస్సులు కామన్ అయ్యాయి కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా లైట్ కిస్సులను పెద్దగా పట్టించుకోవడం లేదు. సో.. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఈ కిస్సు కుటుంబ ప్రేక్షకులకు పంటికింద రాయిలా పడకుండా ఉంటే అదే పదివేలు.