లీసా టీజర్ టాక్

0

గీతాంజలి – చిత్రాంగద లాంటి హారర్ చిత్రాల్లో నటించింది అంజలి. ఆ సినిమాలు హారర్ నేపథ్యంలో తెరకెక్కి జనాలకు నచ్చాయి. మరోసారి అదే పంథాలో అంజలి కొత్త ప్రయత్నం చేస్తోంది. ఈసారి రియల్ 3డి తో విజువల్ గా కొత్త అనుభూతిని మిగిల్చే హారర్ సినిమాలో నటిస్తున్నానని అంజలి చెబుతోంది. లీసా అనేది ఈ సినిమా టైటిల్. రాజు విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. సామ్ జోన్స్ – మకరంద్ దేశ్ పాండే – బ్రహ్మానందం – యోగి బాబు – సలీమా – మైమ్ గోపీ – సురేఖ వాణి – కళ్యాణి నటరాజన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమిళం – తెలుగు – మలయాళం – హిందీలో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా లీసా 3డి టీజర్ రిలీజైంది.

అయితే అన్ని హారర్ సినిమాలు ఒకేలా ఉంటాయి అనిపించేలా ఈ టీజర్ కూడా ఏమాత్రం ఆసక్తి రేకెత్తించలేకపోయింది. ఫక్తు రెగ్యులర్ హారర్ మూవీ కాన్సెప్టుతోనే ఇది కూడా రెడీ అవుతోందని అర్థమైంది. యథావిధిగానే ఒక అడవిలో ఓ బూత్ బంగ్లా అందులో తిరిగే దెయ్యం చేసే విన్యాసాలు.. దానికి భయపడే మనుషులు ఇదంతా ఏమాత్రం కొత్తగా లేదు. పరమ రొటీన్ కథనే ఎంచుకుని 3డిలో తీస్తున్నారని అర్థమవుతోంది. ఇలాంటి రెగ్యులర్ కాన్సెప్టుని ఎంచుకుని 3డిలో ప్రయోగం చేయడం ఎంతవరకూ సఫలమవుతుంది? అన్నది వేచి చూడాలి. 3డి అంటే బడ్జెట్ పరంగానూ పెద్ద రేంజు అని అర్థం చేసుకోవచ్చు.

పైగా నాలుగు భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు అంటే అదో పెద్ద ఛాలెంజ్ కిందే లెక్క. మరి ఈ ఛాలెంజ్ లో అంజలి టీమ్ ఏమేరకు సక్సెసవుతుందో చూడాలి. అంజలి ప్రస్తుతం బిజీ స్టార్. లిసా చిత్రంతో పాటు తమిళంలో నాలుగు .. తెలుగులో రెండు .. మలయాళంలో ఓ చిత్రం చేస్తోంది. 2019-20 డైరీ హౌస్ ఫుల్. ఈ ఏడాది అంజలి బిజీ బిజీగా షూటింగుల హడావుడిలోనే ఉంటుంది.
Please Read Disclaimer