ఈ కీబోర్డ్‌ను ఫోన్లకూ కనెక్ట్ చేసుకోవచ్చు..!

0logitech-k375sకంప్యూటర్ ఉత్పత్తుల తయారీదారు లాజిటెక్ కొత్త తరహా వైర్‌లెస్ కీ బోర్డ్‌ను విడుదల చేసింది. ‘కె375ఎస్’ పేరిట విడుదలైన ఈ కీ బోర్డ్ యూజర్లకు రూ.1995 ధరకు లభ్యమవుతోంది. దీన్ని ఈ నెల 26వ తేదీ నుంచి లాజిటెక్ సైట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇతర వైర్‌లెస్ కీబోర్డ్‌లలా కాకుండా ఈ లాజిటెక్ కీబోర్డ్‌ను స్మార్ట్‌ఫోన్స్, టాబ్లెట్లకు కూడా సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. అందుకు ఓటీజీ కేబుల్ వాడాల్సిన పనిలేదు. వైఫై ఉంటే చాలు, పీసీ, స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్, ల్యాప్‌టాప్… ఇలా ఏ డివైస్‌కైనా ఈ కీ బోర్డ్ కనెక్ట్ అవుతుంది.

లాజిటెక్ కె375ఎస్ కీబోర్డ్‌తోపాటు ఓ ప్రత్యేక స్టాండ్ కూడా యూజర్లకు లభిస్తోంది. అందులో స్మార్ట్‌ఫోన్‌ను పెట్టుకుంటే చాలు, దాంతో కీబోర్డ్ సహాయంతో సులభంగా ఫోన్‌లో టైప్ చేసుకోవచ్చు. ఈ కీబోర్డ్‌లో ఉండే బిల్టిన్ బ్యాటరీ 24 నెలల వరకు పనిచేస్తుంది. నీరు, డస్ట్ వంటివి పడినా వెంటనే వాటంతట అవే బయటకు వెళ్లేలా స్పిల్ రెసిస్టెంట్ టెక్నాలజీని ఇందులో ఏర్పాటు చేశారు. 33 అడుగుల దూరంలో ఉన్నా ఈ కీబోర్డ్ సహాయంతో సులభంగా ఆయా డివైస్‌లకు కనెక్ట్ అవ్వచ్చు. అన్ని రకాల ఐఓఎస్, ఆండ్రాయిడ్, మాక్, విండోస్ డివైస్‌లకు ఈ కీబోర్డ్ కనెక్ట్ అవుతుంది.