వైసీపీ ఎంపీలకు భాస్కర్ అవార్డులు

0ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ మరియు ఐటి మంత్రి నారా లోకేష్ మరోసారి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఫై నిప్పులు చెరిగారు. తన ట్విట్టర్ లో వైసీపీ ఎంపీలకు భాస్కర్ అవార్డులు ఇవ్వాలని సెటైర్లు వేసాడు. ‘ఏమి నటన.. రాజీనామా డ్రామాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నా… వైసీపీ ఎంపీలకు భాస్కర్ అవార్డు ఇవ్వాలి. బీజేపీతో ఒప్పందం చేసుకొని.. తెలివిగా టైంపాస్ చేశారు.

సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు రాజీనామాలతో ఉప ఎన్నికలు నుంచి తప్పించుకున్నారు. వారెవ్వా’ అంటూ లోకేష్ పేర్కొన్నాడు. మరో ట్వీట్‌లో ‘ఏ1 మరియు అర డజన్ దొంగలు పేరుతో వాళ్ల స్టోరీతోనే ఓ సినిమా తీస్తే బావుంటుందని నేను సలహా ఇస్తున్నా’ అంటూ లోకేష్ తెలిపాడు. గత కొన్ని రోజులుగా లోకేష్ ట్విట్టర్ లో తన దూకుడును చూపిస్తున్న సంగతి తెల్సిందే.