నేపాల్‌ పారిపోయిన డేరా బాబా దత్తత కుమార్తె..?

0Ram-Rahim-had-an-illicit-reడేరా సచ్చా సౌదా చీఫ్ రామ్ రహీం గుర్మీత్ సింగ్‌‌కు జైలుశిక్ష పడినప్పటి నుంచి పరారీలో ఉన్న ఆయన పెంపుడు కుమార్తె హనీప్రీత్ ఇన్సాన్ నేపాల్ పారిపోయినట్టు సంచలన వార్తలు వెలుగుచూస్తున్నాయి. గుర్మీత్‌కు శిక్ష పడినప్పటి నుంచి ఆమె పరారీలోనే ఉన్నారు. గుర్మీత్‌ను రహస్యంగా వేరే ప్రాంతానికి తరలించేందుకు ఆమె కుట్ర పన్నారని, దోషిగా ప్రత్యేక కోర్టు తీర్పు వెలురించిన వెంటనే అల్లర్లకు కూడా ఆమె సంకేతాలిచ్చి పెద్దఎత్తున గుర్మీత్ అనుచరులను రెచ్చగొట్టారని హర్యానా పోలీసులు అనుమానిస్తున్నారు. గత సోమవారం సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి గుర్మీత్‌కు 20 ఏళ్లు జైలుశిక్ష ప్రకటించగానే హనీప్రీత్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. సిర్సాలోని డేరా బాబా అనుచరుడి ఇంట్లో ఆమె తలదాచుకున్నారని తొలి వార్తలు వెలువడినా, తాజా సమాచారం ప్రకారం ఆమె దేశ సరిహద్దులు దాటేశారని, నేపాల్‌కు పరారైందని హర్యానా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెపై ‘లుక్ ఔట్’ నోటీసులు జారీ చేశారు. సరిహద్దుల్లోని భద్రతా ఏజెన్సీలను సైతం అప్రమత్తం చేశారు.