‘మా’ అసోసియేషన్‌ ముట్టడి..

0తెలుగు చిత్ర పరిశ్రమ లో క్యాస్టింగ్ కౌచ్‌ రోజు రోజుకు పెరిగిపోతుందని , అవకాశాలు ఇప్పిస్తామంటూ రూమ్ కు పిలిపించుకొని వారి కోర్కెలు తీర్చుకుంటున్నారని , నిర్మాతల దగ్గరి నుండి వారి కుమారుల వరకు ఇలాగే వ్యవహరిస్తున్నారని నటి శ్రీ రెడ్డి గత నెల రోజులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా ఈమెకు తెలంగాణ యూత్ ఫోర్స్ మద్దతు తెలిపింది.

శ్రీరెడ్డి వ్యవహారాన్ని తేల్చకుంటే ‘మా’ అసోసియేషన్‌ను ముట్టడిస్తామని తెలంగాణ యూత్ ఫోర్స్ తెలిపింది. ఈ మేరకు ఫిల్మనగర్‌లోని ‘మా’ అసోసియేషన్‌కు తెలంగాణ యూత్ ఫోర్స్ వినతి పత్రం సమర్పించింది.
శ్రీరెడ్డి వ్యవహారాన్ని త్వరగా పూర్తి చేసి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడాలని వారు కోరడం జరిగింది. మరోపక్క ఎన్‌హెచ్‌ఆర్సీ సైతం శ్రీ రెడ్డి కి మద్దతు తెలుపడం , ఈమె పోరాటం లో మొదటి విజయం అందుకున్నట్లే అని అందరూ మాట్లాడుకుంటున్నారు.