శ్రీరెడ్డిపై ‘మా’ నిషేధం

0ఫిలిం ఛాంబర్‌ వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేఇస్న నటి శ్రీరెడ్డిని మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ బహిష్కరించింది. అసోషియేషన్‌లో ఉన్న 900మంది సభ్యులు శ్రీరెడ్డితో నటించకూడదని ‘మా’ తీర్మానించినట్లు అధ్యక్షుడు శివాజీరాజా వెల్లడించారు.

శ్రీరెడ్డి వివాదంపై ఆదివారం అత్యవసరంగా సమావేశమైన మా అసోషియేషన్ సభ్యులు సభ్యత్వ నమోదుపై ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు. శ్రీరెడ్డికి ‘మా’లో సభ్యత్వానికి దరఖాస్తు ఇచ్చామని.. అయితే ఆమె సరిగా ధ్రువీకరించకుండా, డబ్బులు చెల్లించకుండా సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్ చేసిందని అసోషియేషన్ ఆరోపించింది. ఫిలిం ఛాంబర్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని… ఇతర నటీనటులెవరైనా శ్రీరెడ్డిలా ప్రవర్తిస్తే పరిశ్రమ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. దయచేసిన శ్రీరెడ్డి లాంటి మానసిక రుగ్మతలు వున్న వారిని మీడియా ఎంకరేజ్ చేయకూడదని కోరారు శివాజీరాజా