మాయా సినిమా ట్రైలర్

0కామకేళిలో ఎన్ని రకాల భంగిమలున్నాయో తెలుపుతూ.. ”కామసూత్ర”ను ప్రపంచానికి అందించిన దేశం మనది. కాని అందులో వివిధ భంగిమల్లో సెక్స్ చేయడం తప్పిస్తే.. ఒక పార్టనర్ ను కట్టేసి కొట్టడం.. వారికి రకరకాల పనిముట్ల ద్వారా హాని కలిగించడం.. వారిని చిన్నజాతిలా ట్రట్ చేస్తూ రెచ్చిపోవడం.. వంటి అంశాలు ఉండవు. పాశవిక వైల్డ్ సెక్స్ అనేది మన దేశ సంస్కృతికి పెద్దగా తెలియని విషయం. కాని బి.డి.ఎస్.ఎం. సెక్స్ పేరుతో పశ్చిమాన ఇలాంటి రచ్చ చాలా చూస్తుంటాం. దాదాపు పోర్న్ సినిమాలన్నింటిలోనూ ఈ స్లేవ్ సెక్స్ నే తెగ చూపిస్తారు.

అయితే దీనిని పాశవిక సెక్స్ లా కాకుండా.. ఇది కూడా ఆనందంగా చేసే ఒక క్రీడే అన్నట్లు.. ఒక పెద్దావిడ ”ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే” అంటూ ఒక లవ్ నవల రాసింది. దానినే సినిమాగా కూడా తీశారు. అది పెద్ద హిట్టయ్యింది కూడా. అయితే ఈ సినిమా అసలు ఇండియాలో రిలీజ్ కు నోచుకోలేదు. మన కల్చర్ కు వ్యతిరేకం అంటూ సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వడానికే నిరాకరించింది. మరి ఇదే అదును అనుకున్నాడేమో తెలియదు కాని.. వెరైటీ థ్రిల్లర్లను తీసే విక్రమ్ భట్ వెంటనే ఈ సినిమా కథను ఒక శాడిస్ట్ థ్రిల్లర్ గా మార్చేసి ”మాయా” అంటూ వెబ్ సిరీస్ తీసిపాడేశాడు. సదరు వెబ్ సిరీస్ ట్రైలర్ చూస్తే ఆ విషయం మనకు అర్దమైపోతుంది.

’50 షేడ్స్ ఆఫ్ గ్రే’ సినిమాలో.. హీరో అండ్ హీరోయిన్ మధ్యన ఒక రొమాంటిక్ ట్రాక్ ను గొప్పగా ఆవిష్కరిస్తారు. కాని ఈ హిందీ వెబ్ సిరీస్ లో మాత్రం.. ఒక యువకుడు తన కోరికలను బలవంతంగా తీర్చుకోవడానికి పెళ్ళయిన ఒక లేడీని బలవంతంగా ఇలా కట్టేసి కొట్టేసి ఆమెతో సెక్స్ చేయడమే కథ అన్నట్లు తీశాడు గురుడు. చూడ్డానికి ఇది చిరాకుగా ఉంటే.. ఈసలు ఈ పాత్రలో నటించడానికి శామా సికందర్ అనే టివి నటి ఏదో గొప్ప బోల్డ్ ప్రయత్నం చేస్తున్నట్లు ఒప్పుకోవడం ఇంకా విడ్డూరంగా ఉంది.