బిగ్ బాస్ 2: నాకు కాల్ వచ్చింది కానీ..

0ఒక న్యూస్ ని మరో న్యూస్ డామినేట్ చేయడం అనేది ఈ రోజుల్లో కామన్ అయిపొయింది. ఒక విషయాన్ని గురించి మాత్రమే హైలెట్ చేసే మీడియా ఇప్పుడు ప్రతి చోటా ఉన్నాయి. టాలీవుడ్ లో అయితే ఈ మధ్య మీడియా డోస్ చాలా పెరిగిపోయింది. ఆ విషయం పక్కనపెడితే బిగ్ బాస్ గురించి ప్రస్తుతం మళ్ళీ మీడియాల్లో కాంట్రవర్షియల్స్ క్రియేట్ అవుతున్నాయి. అమెరికా సెక్స్ రాకెట్ – బిగ్ బాస్ కాంట్రవర్షియల్స్ న్యూస్ లు పోటా పోటీగా నడుస్తున్నాయి.

అసలు విషయంలోకి వస్తే.. బిగ్ బాస్ కి కూడా క్యాస్టింగ్ కౌచ్ అంటుకుందని ఇటీవల మాధవీలత మీడియాల్లో చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. మొదట బిగ్ బాస్ 1 చాలా నచ్చిందని చెప్పిన ఆమె సెకండ్ సీజన్ మాత్రం అంతగా నచ్చలేదని చెప్పడం కూడా వైరల్ అవుతోంది. ఇంకా ఆమె ఏం చెప్పింది అంటే.. బిగ్ బాస్ 2 నుంచి తనకు కూడా కాల్ వచ్చిందని అయితే మొదటి సారి మాట్లాడినప్పుడు నార్మల్ గా అనిపించింది కానీ సెకండ్ టైమ్ వారితో మాట్లాడినప్పుడు నచ్చలేదని చెప్పింది. ఇక అప్పటి నుంచి ఏ కాల్ రాలేదని కూడా మాధవీలత వివరణ ఇచ్చారు.

ప్రస్తుతం బిగ్ బాస్ షోకి కాంట్రవర్షియల్ న్యూస్ లతో ప్రమోషన్స్ చాలా పెరుగుతుందనే చెప్పాలి. అలాగే నానిపై హోస్టింగ్ పై భిన్నాభిప్రాయాలు వస్తున్నప్పటికీ రేటింగ్ లో పెద్దగా తేడా కనిపించడం లేదు. బిగ్ బాస్ పై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు కూడా ఓ వైపు వైరల్ అవుతున్నాయి. ఎక్కువగా హౌజ్ లో కంటే ఇప్పుడు బిగ్ బాస్ వివాదాలు బయటకే ఎక్కువ అవుతున్నాయి. ఇక ముందు ముందు ఇంకెన్ని వివాదాలు తెరపైకి వస్తాయో చూడాలి!