మహేష్ ఆలా చేసాడు కాబట్టే నచ్చలేదు – మాధవీలత

0ప్రస్తుతం ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్ అనేది హాట్ టాపిక్ గా కొనసాగుతుంది..అవకాశాలు లేని హీరోయిన్లంతా దీని ఫై మాట్లాడుతున్నారు. ఇప్పటికే శ్రీ రెడ్డి ఓ సంచలనం గా మారగా , నేను ఏమైనా తక్కువ అన్నట్లు నటి మాధవీలత సైతం గతం లో జరిగిన సంఘటనలను బయటపెడుతూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కొన్ని వాక్యాలు చేసి హాట్ టాపిక్ అయ్యింది.

ఓ ఇంటర్వ్యూ లో మాధవీలత మాట్లాడుతూ..” నేను అతిధి సినిమాలో మహేష్ కో స్టార్ గా వర్క్ చేసినప్పుడు షూటింగ్ కు లేట్ గా వచ్చాను. అయితే 5 నిమిషాల వరకు పక్కన నిల్చోబెట్టి దర్శకుడు నన్ను చాలా అవమానకరంగా తిట్టారు. ఆఖరికి F** OFF అనే మాట కూడా అనేసినట్లు” మాధవీలత చెప్పుకొచ్చింది. అయితే ఆ సమయంలో మహేష్ బాబు పక్కనే ఉన్నాడని , దర్శకుడి తిడుతుంటే ఒక అమ్మాయిని అసభ్యంగా తిడుతున్నారే అని జాలి లేకుండా కనీసం ఆపడానికి కూడా ట్రై చేయలేదు.

నిజంగా అది దారుణమైన పరిస్థితి అంటూ అందుకే తనకు మహేష్ బాబు అంటే ఇష్టం లేదని తెలిపింది. ఈమె వాక్యాలకు నెటిజన్లు తీవ్ర స్థాయి లో మండిపడుతున్నారు. నువ్వు లేటుగా వచ్చి తిట్లు తింటే మహేష్ ఎలా కారణం..అంటూ ఓ రేంజ్ లో ఆమెపై విరుచుకుపడుతున్నారు.