సీరియల్ శివగామిగా సీనియర్ హీరోయిన్

0madhubala-as-serial-sivagamబాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రచయిత విజయేంద్ర ప్రసాద్, బుల్లితెరపై సత్తా చూపిస్తున్నాడు. భారీ గ్రాఫిక్స్ తో హిందీలో రూపొందుతున్న ఆరంభ్ సీరియల్ కు కథ అందిస్తున్నాడు విజయేంద్ర ప్రసాద్. దాదాపు బాహుబలి తరహా కథా కథనాలతో రూపొందుతున్న ఈ సీరియల్ లో సౌత్ బ్యూటీ కార్తీక దేవసేన గా నటిస్తోంది. తాజాగా ఈ సీరియల్ కు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

త్వరలో టెలికాస్ట్ కానున్న ఈ సీరియల్ లో శివగామి తరహా పాత్ర కూడా ఉంది. ఈ పాత్రలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజా మూవీ ఫేం మధుబాల నటిస్తోంది. ఈ విషయాన్ని మధుబాల స్వయంగా ప్రకటించింది. చిత్ర దర్శకుడు గోల్డీ బెహన్, ఆయన భార్య సోనాలి తో ఉన్న స్నేహం కారణంగానే ఏ మాత్రం ఆలోచించకుండా ఈ సీరియల్ లో నటించేందుకు అంగీకరించానంది మధుబాల.