ఈ చెలి.. ఆ రోజానే

0సుమారుగా రెండు దశబ్ధాలు కిందట ఒక పాట వచ్చింది. చిన్ని చిన్ని ఆశ చిన్నదని ఆశ అంటూ ఒక చిన్నది వెండితెరపై పాడుతుంటే.. దేశం మొత్తం జోలపాట విన్నంత హాయిగా ఆలకించారు. ఈ పాటతోనే వెండితెర పై పూసిన ముద్దబంతి పువ్వే ఇక్కడ నిలుచున్న చెలి మధుబాల. కాశ్మీర్ అందాలలో తన పరువాలతో ముద్దుగా కనిపించిన ఆ కొడలు ఈ అమ్మాయే.

తన సినిమా జీవితం మూడు కాయలు ఆరు పువ్వులు గా ఉన్నపుడే సినిమాకు స్వస్తి చెప్పి ఆనంద్ షాహ్ అనే బిజినెస్ మాన్ పెళ్లికేసుకొని ముంబాయ్ లో స్థిరపడి పోయింది మధుబాల. సినిమాలకు కొన్నేళ్ళు దూరంగా ఉన్న మధుబాల ఇప్పుడు మళ్ళీ సినిమాలోకి తిరిగి అడుగుపెట్టింది. ఆ మధ్యన మాట్లాడుతూ.. నేను అమ్మ రోల్స్ చేయడానికి చిన్నగా ఉన్నానట.. అలాగని హీరోయిన్ రోల్స్ ఇవ్వరు.. అంటూ కామెంట్ చేసింది. అసలు ఇక్కడ ఉన్న ఫోటో చూస్తే ఆమెకు ఎవరైనా అమ్మ రోల్స్ ఇస్తారా? ఒక స్టార్ హీరోయిన్ లుక్ కనిపించటం లేదు?

పొట్టి షార్ట్స్ వేసుకొని మెరూన్ కలర్ హాఫ్ టాప్ తో వ్యయారంగా నిలుచోని ఇప్పటి హీరోయిన్లకు సరిసమానంగా ఉందీ మధు. కొండలలో పూసిన జాజిమల్లి లా ఇలా స్వేచ్చగా విహరిస్తున్న ఈమెను చూస్తే.. అసలు ఇద్దరు పిల్లలు తల్లి అని కూడా ఎవరూ అనుకోరు. అలాంటప్పుడు మమ్మీ రోల్స్ ఎలా ఇస్తారులే!!Madhubala-Glamourous-Pose