స్టార్ హీరోకి వార్నింగ్ ఇచ్చిన చైతూ హీరోయిన్!

0madonnaమడోనా సెబాస్టియన్ గుర్తుందా? ఆ మధ్య ‘ప్రేమమ్’ సినిమాలో సెకెండాఫ్ లో వచ్చి మ్యాజిక్ చేసి వెళ్లిందే ఆ మలయాళ బ్యూటీ. ఒరిజినల్ ప్రేమమ్ లో నటించిన ఈమెనే తెలుగు వెర్షన్ కు కూడా తీసుకున్నారు. ఆ సినిమాతో మంచి గుర్తింపే వచ్చింది కానీ మళ్లీ అంతగా అవకాశాలు రాలేదు. ఆ సంగతలా ఉంటే.. ఆ అమ్మాయి పేరు ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వ్యవహారంలో వినిపిస్తోంది. ప్రముఖ తమిళనటుడు ధనుష్ అండ్ కోకు గట్టివార్నింగే ఇచ్చిందట మడోన్నా.

ఇంతకీ కథేమిటంటే.. మడోన్నాను ఒక సినిమాలో హీరోయిన్ తీసుకుంది ధనుష్ టీమ్. ప్రధాన హీరోయిన్ గా కాదు కానీ, ఒక హీరోయిన్ గా ఈమెకు అవకాశం ఇచ్చారట. అంత వరకూ బాగుంది. సినిమా పూర్తి అయ్యింది. ప్రమోషన్ వద్ద గొడవ వచ్చింది. సినిమా ప్రమోషన్ కు మొహం చాటేసిందట మడోన్నా. దీనిపై ధనుష్ టీ మ్ ఆమెను సంప్రదించింది. ఇక్కడే వ్యవహారం తేడా కొట్టింది.

ప్రమోషన్ కు రమ్మని ఆమెను సంప్రదించడంలో అనుచితంగా మెసేజ్ చేసిందట ధనుష్ టీమ్. దీంతో మడోన్నా మండి పడుతోంది. మర్యాదగా నడుచుకోండి.. మీకు ఇష్టం వచ్చినట్టుగా మెసేజ్ లు చేస్తారా? అంటూ ఆమె ధనుష్ అండ్ టీమ్ కు వార్నింగ్ ఇచ్చిందట. మరి ప్రమోషన్ కూ మొహం చాటేసి.. ప్రతిగా తమకే ఆమె వార్నింగ్ ఇచ్చే సరికి ధనుష్ టీమ్ కారాలూమిరియాలూ నూరుతోందట.