అయస్కాంత కన్యతో తస్మాత్ జాగ్రత్త!

0

Magnet-First-Lookఈ మ్యాగ్నెట్ అతుక్కుంటే వదలదు! కుర్రాళ్ల గుండెలకు సూదిలా గుచ్చుకుని – వైరస్ లా చిల్లు పెడుతుంది. ఆపై ఆపరేషన్ కత్తికి కూడా చిక్కదు దొరకదు. అంత పవర్ఫుల్ మ్యాగ్నెట్. ఆ సంగతి ఇదిగో ఈ పోస్టర్ చూస్తేనే తెలుస్తోంది. కుర్రాళ్ల కళ్లు పోస్టర్లకు అతుక్కుపోతాయ్. అంత హాట్గా ఆకర్షిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరింతకీ? అంటే .. ఇంకెవరు..? పోటుగాడు – జేమ్స్ బాండ్ చిత్రాలతో కుర్రాళ్ల గుండెలకు అతుక్కుపోయిన సాక్షి చౌదరి.

ఇటీవలే `సువర్ణ సుందరి` అంటూ బరిలో దిగింది. ఆ సినిమా పోస్టర్లు వేడెక్కించాయి. సాక్షి మరో విలక్షణ పాత్రలో నటిస్తోందని అందరికీ అర్థమైంది. అయితే ఈలోగానే మరో టపాకాయ్ పేలుస్తూ ఇదిగో ఇలా ప్రత్యక్షమైంది చౌదరి బాంబ్. అందాల ఆరబోతలో హద్దే లేకుండా చెలరేగిపోతున్న సాక్షి చౌదరి ప్రధాన నాయికగా ఎమ్.ఏ.ఏస్ రెడ్డి దర్శకత్వంలో `మాగ్నెట్` చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో పోసాని కృష్ణ మురళి – భరణి వంటి స్టార్లు నటిస్తున్నారు.

ప్యూర్ లవ్ రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అంటూ చిత్రయూనిట్ ప్రచారం సాగిస్తోంది. లార్డ్ శివ క్రియేషన్స్ బ్యానర్ పై ఏం.శివా రెడ్డి నిర్మిస్తున్న మాగ్నెట్ ఫస్ట్ లుక్ యూత్ కి అయస్కాంతం లా అతుక్కుపోయిందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఒక మగాడి ముఖంపై కాలు ఎత్తి – ఆ గెడ్డాన్ని తాకుతున్న పోస్టర్ లో సాక్షి గట్స్ ని మెచ్చుకోవాలి. పనిలో పనిగా స్వేదం చిందేంతగా లేసుల జాకెట్ – డెనిమ్ నిక్కరు లుక్ లో ఏం చేసిందో ఏంటో!! పోస్టర్లతోనే కాదు త్వరలోనే టీజర్ తో వేడెక్కించేస్తుందిట!!!
Please Read Disclaimer