మహానటి శ్రీదేవికి అంకింతం

0భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించికున్న నటి సావిత్రి. ఆమె జీవిత కథ ఆధారంగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’. కీర్తిసురేష్‌ టైటిల్‌రోల్‌ పోషిస్తుండగా, జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు. ఈ సినిమాని శ్రీదేవికి అంకింతం చేస్తున్నారు.

వైజయంతీ మూవీస్‌కీ శ్రీదేవికి మధ్య మంచి అనుబంధం ఉంది. శ్రీదేవిని ‘అతిలోక సుందరి’గా చూపించిన సంస్థ.. వైజయంతీ మూవీస్‌. ఈ సంస్థ సినీ ప్రయాణంలో ‘జగదేక వీరుడు – అతిలోక సుందరి’ ఓ మైలు రాయి. నాగార్జున – శ్రీదేవిల ‘ఆఖరి పోరాటం’ కూడా అశ్వనీదత్‌ నిర్మించినదే. అందుకే… శ్రీదేవి స్మృతికి చిహ్నంగా తమ తాజా చిత్రం ‘మహానటి’ని అంకితం ఇస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.