‘మహానుభావుడు’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

0Mahanubhavudu-movieఈ దసరా పండగ నాడు రెండు పెద్ద సినిమాలు థియేటర్లలో ఉండగా మహానుభావుడు థియేటర్లకు వచ్చాడు. మారుతి దర్శకత్వంలో శర్వానంద్ – మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటించిన మహానుభావుడు మీడియం బడ్జెట్ మూవీ. రొమాంటిక్ ఎంటర్ టెయినర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకాదారణ బాగానే ఉంది. ఈ సినిమా కోసం మొత్తం ఖర్చు పెట్టింది రూ. 12 కోట్లు. ఈ మొత్తం కలెక్షన్లు ఈ సినిమాకు ఐదంటే ఐదే రోజుల్లో వచ్చేశాయి.

మొదటి వారం ముగిసేసరికి మహానుభావుడు రూ. 32 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఇందులో షేర్ రూ. 17.5 కోట్లు. అంటే నిర్మాతల వంశీ – ప్రమోద్ లకు మొదటి వారంలో రూ. 5.5 కోట్ల లాభం దక్కిందన్న మాట. ఈ సినిమాకు వీక్ డేస్ లో కూడా కలెక్షన్లు బాగా ఉన్నాయి. దీనికితోడు రెండోవారం నుంచి స్క్రీన్లు మరింత పెంచుతుండటం మరీ విశేషం. కలెక్షన్లు ఇదే విధంగా కొనసాగితే రూ. 30 కోట్ల క్లబ్ లో చేరే శర్వానంద్ రెండో చిత్రం ఇదే అవుతుందని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు. మహానుభావుడు చిత్రానికి మారుతి గతంలో తీసిన భలేభలే మగాడివోయ్ సినిమాతో పోలికలున్నాయనే డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం బ్రహ్మాండంగా ఉండటం విశేష:.

మహానుభావుడు మొదటివారం కలెక్షన్లు (షేర్)

నైజాం: రూ. 4.45 కోట్లు
సీడెడ్: రూ. 1.95 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ. 2.17 కోట్లు
గుంటూరు: రూ.1.36 కోట్లు
కృష్ణా: రూ. 1.17 కోట్లు
ఈస్ట్: రూ. 1.30 కోట్లు
వెస్ట్: రూ. 0.80 కో్ట్లు
నెల్లూరు: రూ. 0.40 కోట్లు
ఏపీ & నైజాం మొదటివారం మొత్తం కలెక్షన్లు: రూ. 13.6 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా మహానుభావుడు మొదటివారం కలెక్షన్లు: రూ. 17.5 కోట్లు (యూఎస్ ఏ: రూ. 1.95 కోట్లు – కర్ణాటక: రూ. 1.44 కోట్లు – మిగిలిన అన్ని ప్రాంతాలు: రూ. 0.51 కోట్లు కలుపుకుని)