మహానుభావుడి బెంగ తీరిపోయినట్టే!

0Mahanubhavudu-Maha-Speedరెండు భారీ చిత్రాలతో తలపడ్డానికి సిద్ధపడిన ‘మహానుభావుడు’ చిత్రానికి ఒక చింత తొలగిపోయినట్టే. ‘జై లవకుశ’ సినిమాకి యావరేజ్‌ టాక్‌ రావడం వల్ల మహానుభావుడు వచ్చేవరకు హోల్డ్‌ చేయడం కష్టమేనని ట్రేడ్‌ సర్కిల్స్‌ అంటున్నాయి.

స్పైడర్‌ తర్వాత రెండు రోజులకి రాబోతున్న మహానుభావుడు దసరా, గాంధీ జయంతి హాలిడేస్‌పై బాగా డిపెండ్‌ అయింది. ఆ సెలవులని క్యాష్‌ చేసుకోవాలంటే పెద్ద సినిమాల్లో ఏదో ఒకటి కాస్త వీక్‌ అవ్వాలి. స్పైడర్‌ సంగతి ఏమిటనేది ఇంకా తెలియదు కానీ జై లవకుశ అయితే ఎన్టీఆర్‌ నటన మినహా తేలిపోయిందని అంతటా వినిపిస్తోంది. దీంతో మహానుభావుడికి అడ్వాంటేజ్‌ అవుతుంది.

కొత్త సినిమా కనుక సెలవుల టైమ్‌లో దీనికే మొగ్గు చూపుతారు. బడ్జెట్‌ ఎక్కువ కాదు కనుక మహానుభావుడు మొదటి వారంలో సెలవులని క్యాష్‌ చేసుకుంటే సేఫ్‌ వెంఛర్‌ అవుతుంది. అయితే స్పైడర్‌కి బ్లాక్‌బస్టర్‌ టాక్‌ వచ్చినట్టయితే మహానుభావుడిపై ఎఫెక్ట్‌ ఎంత వుంటుందనేది ఇప్పుడే చెప్పలేని సంగతి. ఈ రెండిట్లో ఒకటైనా అటు ఇటు అవుతుందనే దానిపై గ్యాంబుల్‌ తీసుకున్న మహానుభావుడు టీమ్‌ లెక్క జై లవకుశ విషయంలో నిజమైంది.