ట్రైలర్ టాక్: మహానుబావుడు అదిరే!

0హీరో శర్వానంద్ ప్రతీసారి కామెడీ ఎంటర్టయినర్ తో అలరించాలనే చూస్తున్నాడు. అయితే రన్ రాజా రన్ వర్కవుట్ అయ్యాక.. ఆ రేంజులో మరో సినిమా పడలేదు. కాకపోతే ఫ్యామిలీ సినిమా అయిన శతమానం భవతితో పెద్ద హిట్టే కొట్టాడు. ఇప్పుడు మరోసారి కామెడీతో హిట్టుకొట్టాలంటూ మారుతి డైరక్షన్లో ”మహానుభావుడు” సినిమాతో వస్తున్నాడు. పదండి ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.

అతి శుభ్రం అనే డిజార్డర్ తో బాధపడుతున్న వ్యక్తిగా శర్వా అదరగొట్టేశాడు. దానికితోడు మారుతి కామెడీ తీయడంలో చాలా ఆరితేరినవాడు. అందుకే మనోడు కూడా శర్వాను కరక్టుగా వాడుకుని టైమింగ్ తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మెహ్రీన్ తన తొలిసినిమా అయిన కృష్ణగాడి వీర ప్రేమగాధలో ‘నేను చెప్పానా నీకు చెప్పానా నిన్న చెప్పానా’ అనే హుక్ లైన్ తో ఎలాగైతే ఎట్రాక్ట్ చేసిందో.. అదే లైన్ ఆమె పైనే పంచ్ గా వేసి ఇరగదీశారు. ఇక మెహ్రీన్ కూడా క్యూట్ గా ఉంది. దేవుడు మనం ఏది వద్దని అనుకుంటున్నామో అదే ఇస్తాడంటూ.. ఈ అతిశుభ్రుడ్ని మట్టిల్లో మల్లయుద్దాన్నికి పంపించారు. అదే సినిమా కత. పంచులూ ప్రాసలూ కామెడీ డైలాగులూ వాటి తాలూకు రైమింగులూ టైమింగులూ ఈ ట్రైలర్ లో అదిరియాయ్.

ఇక నిజార్ షెఫీ అందించిన సినిమాటోగ్రాఫీ.. తమన్ కొట్టిన మ్యూజిక్.. అలాగే యువి క్రియేషన్స్ వారి ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు పెద్ద ఎసెట్. చూస్తుంటే సెప్టెంబర్ 29న మనోడు మరోసారి హిట్టు కొట్టేశేలా ఉన్నాడే.