మహర్షి…బాగా ఎక్కువయిందెమో బాసు

0

తెలుగు చిత్ర పరిశ్రమలో మాస్ హీరో అనే ట్యాగ్ ఉన్న హీరోలు చాలా తక్కువ… సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ రాబట్టే హీరోల్నే మాస్ హీరోలంటే – ఆ బ్యాచ్ లో ప్రస్తుతం జూనియర్ యన్టీఆర్ – అల్లు అర్జున్ మాత్రమే ఉన్నారని చిత్ర నిపుణులు అంటున్నారు. అయితే ఆ లిస్ట్ లోకి మహేశ్ ని – రామ్ చరణ్ ని కూడా చేర్చాలన్నది కొందరు వాదన – అయితే ఈ వాదోపవాదాలు కాస్త పక్కనపెడతే. మహేశ్ బాబు మేనియా తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మహేశ్ బాబు సినిమా కాస్త బాగున్న దాన్ని సూపర్ హిట్ గా మార్చే వరుకు అతని ఫ్యాన్స్ నిద్రపోరు. కానీ టైమ్ బ్యాడ్ మహేశ్ ఓ సినిమా సూపర్ హిట్ కొడితే మూడు సినిమాలు సూపర్ ఫ్లాపులు కొడుతుంటాయి. దీంతో ఇటు ఫ్యాన్స్ అటు ట్రేడ్ ఎక్స్ పర్ట్స్ మహేశ్ మార్కెట్ పై ఓ కొలిక్కి రాలేకపోతున్నారన్నది వాస్తవం. ఎందుకంటే మహేశ్ సినిమాలకు హిట్ టాక్ వస్తే భారీగా కలెక్షన్స్ వస్తుంటాయి – అదే ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం ఆ సినిమాలు ఆడే థియేటర్ పక్కకి కూడా ప్రేక్షకులు వెళ్లరు. ఈ కన్ఫ్యూజన్ తోనే మహేశ్ ను హీరోగా పెట్టి సినిమాలు తీసే నిర్మాతలు కూడా తెగ టెన్షన్ పడుతుంటారు.

మహేశ్ లేటెస్ట్ మూవీ మహర్షీ విషయంలో కూడా నిర్మాతలు ఫుల్ టెన్షన్ లో ఉన్నారని తెలిసింది. ఎందుకంటే అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కవుగానే మహర్షీని తెరకెక్కించారట – ఏకంగా 140 కోట్లతో మహర్షి నిర్మించారని – ఎటు చూసినా అన్ని రైట్స్ తో కలిపి ఈ సినిమా బిజినెస్ కేవలం 120 కోట్లుకి మించదని దాదాపు 20 కోట్లకి పైగా డెఫ్ షిట్ లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్ ను క్రాస్ చేయడం – ఓవర్ బడ్జెట్ తో సినిమాలు నిర్మించడం వంశీ పైడిపల్లికి షరా మాములేనట – అదే రీతిన మహర్షికి మితిమీరిని ఖర్చు చేయించాడని వంశీ పైడిపల్లే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అగ్ర నిర్మాతలు దిల్ రాజు – అశ్వనిదత్ – పి.వి.పి ఈ సినిమాను నిర్మించారు – మహర్షి మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అయింది.
Please Read Disclaimer