మహర్షి ఫైనల్ కాపీ డ్యూరేషన్ ఇలా ఉంది

0

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా ‘మహర్షి’ మే 1 న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మే 1 న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే నిన్న ‘మహర్షి’ ఫైనల్ వెర్షన్ లాక్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. అన్నీ కలిపి సినిమా నిడివి 2 గంటల 50 నిముషాలు వచ్చిందట.

170 నిముషాలు అంటే ఎక్కువే కానీ మొత్తం ఫుటేజ్ దాదాపు 4 గంటల వరకూ వచ్చిందని.. భారీగా ఎడిటింగ్ చేసిన తర్వాత మూడు గంటలలోపు తీసుకొచ్చారని సమాచారం. సహజంగా మహేష్ సినిమాలన్నీ రెండున్నర గంటల నుండి మూడు గంటలలోపే ఉంటాయి. కాబట్టి 2.50 గంటల డ్యూరేషన్ లాక్ చేయడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఫైనల్ వెర్షన్ పట్ల నిర్మాతలు సంతోషంగా ఉన్నారని.. సినిమా విజయంపట్ల నమ్మకం వ్యక్తం చేస్తున్నారని కూడా టాక్ ఉంది. ఇదిలా ఉంటే సినిమాపై అంచనాలు మరింతగా పెరిగేలా ట్రైలర్ ను కూడా సిద్ధం చేస్తున్నారట. మే 1 న ప్రీ రిలీజ్ ఈవెంట్ నుండి ప్రమోషన్ ను మరింత స్ట్రాంగ్ గా చేసేందుకు ప్లాన్ జరుగుతోందట.

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అల్లరి నరేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు – అశ్విని దత్ – ప్రసాద్ వీ పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer