‘మహర్షి’ హైలైట్స్ ఇవీ

0

`మహర్షి` సెన్సార్ రిపోర్ట్ రిలీజైన సంగతి తెలిసిందే. యుఏ సర్టిఫికెట్ అందుకున్న ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజవుతోంది. తాజాగా ఈ సినిమాని వీక్షించిన ప్రముఖుల నుంచి కొన్ని హైలైట్స్ లీక్ అయ్యాయి. ఈ సినిమాను నిర్మాతలు.. వారి సన్నిహితులు చూసారు. వాళ్లంతా అల్టిమేట్ అంటూ పొగిడేశారని తెలుస్తోంది. వారు ఉప్పందించిన ప్రకారం… ఈ మూవీలో కీలకంగా ప్రథమార్థంలో హీరో క్యారెక్టరైజేషన్ ఉత్కంఠగా వుంటుందట. అన్ లిమిటెడ్ గా డబ్బు- దస్కం ఉన్న హీరోగారు.. తన ఆశయం కోసం పోరాడుతాడు. ఆ పోరాటానికి అడ్డొచ్చిన విలన్ వల్ల ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయన్నదే సినిమా. సినిమాలో ఇది ఫక్తు కమర్షియల్ పాయింట్ అని చెబుతున్నారు. సినిమాటోగ్రఫీ మహదాద్భుతంగా కుదిరింది. అలాగే డిఐ అన్నీకలిసి సినిమాను కలర్ ఫుల్ గా మార్చేశాయట. ముఖ్యంగా కాలేజ్ కుర్రాడిగా మహేష్ మరింత కలర్ ఫుల్ గా కనిపిస్తాడని తెలుస్తోంది.

అసలు ఈ సినిమాలో ఎన్ని హైలైట్ సీన్స్ ఉన్నాయి? అంటే.. రిజిస్టార్ ఆఫీసులో రైతుల భూముల సీన్ .. మహేష్- సాయికుమార్ మధ్య ఎమోషనల్ సీన్ .. ఒక గ్రామం కాదు.. అన్ని గ్రామాల్ని వదిలెయ్యాలి అంటూ విలన్లకు హీరో సవాల్ చేసే సీన్.. హైలైట్ గా ఉంటాయిట. అలాగే ప్రీ క్లయిమాక్స్ లో వచ్చే ప్రెస్ మీట్ సన్నివేశం సినిమాకే కిర్రాక్ పుట్టించేస్తుందని తెలుస్తోంది. ఈ ప్రెస్ మీట్ లో హీరో డైలాగులకు క్లాప్స్ పడతాయన్నది గ్యారెంటీ ఇస్తున్నారు. దీంతో పాటే పతాక సన్నివేశంలో వేలాది మంది రైతులు హీరో వెంట వచ్చే సీన్ చాలా బాగుందని టాక్ వినిపిస్తోంది. క్లైమాక్స్ సాంగ్ మరో హైలైట్ గా నిలుస్తుందట.

ముఖ్యంగా ఈ సినిమాలో సందేశం అద్భుతం. కమర్షియల్ హంగులు అంతే అద్భుతంగా కుదిరాయని సినిమాని ముందే చూసిన వాళ్లు లీకులిచ్చారు. సెన్సార్ బృందం ఈ సినిమా థీమ్ కి ఫిదా అయ్యిందని ఇదివరకూ రిపోర్ట్ అందింది. తొలి నుంచి దిల్ రాజు ఈ సినిమాపై ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నిన్నటిరోజున హైదరాబాద్ ట్రైడెంట్ హోటల్ లో మీడియా మీట్ లోనూ మహేష్ ముఖంలో ఆ ఆనందం కనిపించిందని గుసగుసలు మీడియాలో వినిపించాయి. ఇక వంశీ పైడిపల్లి ఈ సినిమా కోసం ఎంతగా ప్రాణం పెట్టి శ్రమించారో ఆ అలసట ఒత్తిడి అంతా ఆయన ముఖంలో కనిపిస్తూనే ఉంది. ఒక గొప్ప సందేశాత్మక చిత్రాన్ని కమర్షియల్ పంథాలో చూపించేందుకు అహోరాత్రులు వంశీ శ్రమించారని సన్నిహితులు చెబుతున్నారు. వంశీ హార్డ్ వర్క్ కి మహేష్ – దిల్ రాజు- పీవీపీ బృందం ఫిదా అయ్యారట.
Please Read Disclaimer