#మహేష్26: మార్చ్ లో లాంచ్.. మే నుండి షూట్?

0

సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఈ సినిమా స్థానంలో అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ సెట్ అయింది. అనిల్ ఇప్పటికే మహేష్ బాబుకు స్టొరీ నెరేషన్ ఇచ్చాడని.. బాక్స్ ఆఫీస్ దగ్గర క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న కమర్షియల్ ఎంటర్టైనర్ కావడంతో సుకుమార్ ప్రాజెక్ట్ కంటే ముందుగా ఈ సినిమాను పట్టాలెక్కించడానికి మహేష్ డిసైడ్ అయ్యాడని అంటున్నారు.

సుకుమార్ స్క్రిప్ట్ తయారు చేసేందుకు మరి కొంత సమయం అడగడంతో.. తనను ప్రెజర్ పెట్టకుండా ఎక్కువ సమయం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే అనిల్ రావిపూడి సినిమాకు పచ్చజెండా ఊపాడట. అనిల్ రావిపూడి స్క్రిప్ట్ తయారు చేయడంలోనూ.. పట్టాలెక్కించిన సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయడంలోనూ జెట్ స్పీడ్. అందుకే ఈ సినిమాను మార్చ్ లో లాంచ్ చేసి మే నుండి రెగ్యులర్ షూట్ మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారట.

అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తారని.. దిల్ రాజు ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తారని సమాచారం. 2020 సంక్రాంతి బరిలోకి దించాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ ఏడాది ‘F2’ తో బ్లాక్ బస్టర్ సాధించిన అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా కూడా సంక్రాంతి బరిలోకి దిగడం అనే ఆలోచన బాగానే ఉంది కానీ మహేష్ సినిమాలు ఒక పట్టాన త్వరగా పూర్తి కావు. మరి మహేష్ సినిమాను అంత త్వరగా పూర్తి చేస్తే రావిపూడి గ్రేటే!
Please Read Disclaimer