మహేష్ 25 వెరీ వెరీ స్పెషల్

0

బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి 1999లో రాజకుమారుడు రూపంలో డెబ్యూ మూవీనే హీరోగా సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబుకు మహర్షి 25వ సినిమాగా ప్రత్యేకంగా నిలవనుంది. ఫ్యాన్స్ ఇప్పటికే దీని పట్ల చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. రెండు దశాబ్దాల కెరీర్ లో ఇండస్ట్రీ హిట్స్ తో పాటు తనకు మాత్రమే సాధ్యమయ్యే ప్రత్యేకమైన ఫాలోయింగ్ ని సంపాదించుకున్న మహేష్ సిల్వర్ జూబ్లీ సినిమా సంబరాన్ని స్పెషల్ గా జరిపేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నట్టు సమాచారం.

మే 18న బెజవాడ వేదికగా కనివిని ఎరుగని స్థాయిలో సంబరాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇది నభూతో నభవిష్యత్ అనే రేంజ్ లో ఉండాలని ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రాధమిక సమాచారాన్ని ప్రతి ఊరికి విడిగా ఉన్న మహేష్ అభిమాన సంఘాల సభ్యులకు సమాచారం చేరవేశారట. ముందస్తు ప్లానింగ్ తో లక్షల సంఖ్యలో ఫ్యాన్స్ వచ్చేలా ప్రణాళికలు రెడీ చేస్తున్నట్టు వినికిడి

దీనికి ముఖ్య అతిధులు ఎవరు ఎలాంటి ప్రోగ్రాంలు ప్లాన్ చేస్తున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మహేష్ కు అత్యంత సన్నిహితంగా ఉండే స్టార్స్ తో పాటు ఇండస్ట్రీలో ప్రిన్స్ ని ఇష్టపడే ప్రతి ఒక్కరు పాల్గొనేలా చూస్తున్నారని తెలిసింది. మే 9న విడుదలయ్యే మహర్షి ఫలితం అప్పటికే తెలిసిపోయి ఉంటుంది కాబట్టి ఇది ఒకరకంగా సక్సెస్ మీట్ లాగా కూడా చేయొచ్చు. మహేష్ ఇప్పటిదాకా నటించిన పాతిక సినిమాల్లోని కీలకమైన సన్నివేశాలు పాటలు ఆ రోజు వేదిక మీద ప్రముఖ డాన్స్ మాస్టర్లతో పాటు కొందరు యూత్ హీరోలతో చేయించే ఆలోచన ఉందట. మొత్తానికి మహేష్ 25 పేరుతో చేయబోయే రచ్చ మాములుగా ఉండేలా కనిపించడం లేదు
Please Read Disclaimer