SSMB25: అది టైటిల్ కాదట!

0



సాధారణంగానే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు క్రేజ్ పీక్స్ లో ఉంటుంది.. ఇక ల్యాండ్ మార్క్ ఫిలిం అయిన 25 చిత్రమైతే ఆ క్రేజ్ ఆకాశాన్ని తాకడంలో ఆశ్చర్యం లేదు కదా. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ క్షణాల్లో వైరల్ అవుతోంది. ఆగష్టు 9 న మహేష్ పుట్టిన రోజు కావడంతో తన తాజా చిత్రం ఫస్ట్ లుక్ టైటిల్ ను రిలీజ్ చేస్తారని అనుకున్నారు. దానికి తగ్గట్టే SSMB25 టీమ్ ఈమధ్య ఒక్కో ఇంగ్లీష్ లెటర్ కు ఒక్కొ పోస్టర్స్ వదులుతూ హింట్స్ ఇచ్చింది.

ఇప్పటివరకూ R I S H I అంటూ ఇదు ఇంగ్లీష్ లెటర్స్ బయటకు రావడంతో సినిమా టైటిల్ ‘రిషి’ అని అభిమానులు ఫిక్స్ అయ్యారు. ఆ టైటిల్ తో సోషల్ మీడియా లో సందడి చేయడం మొదలు పెట్టారు. ఈ సినిమాలో రిషి అనేది మహేష్ బాబు పాత్ర పేరు..అంతే కానీ సినిమా టైటిల్ మాత్రం రిషి కాదట. రేపు.. అంటే ఆగస్ట్ 8 న సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారు దాంతో పాటు మహేష్ బాబు పాత్ర పేరు కూడా అనౌన్స్ చేస్తారు అంతే కానీ టైటిల్ ను మాత్రం మరొక రోజు ఓ గ్రాండ్ గా రిలీజ్ చేస్తారని సమాచారం. సో – ఇది అభిమానులను కొంచెం డిజప్పాయింట్ చేసే అంశమే కానీ.. ఫస్ట్ లుక్ ఉందిగా అది చాలు మహేష్ పుట్టిన రోజు పండగ చేసుకోవడానికి!

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో హీరో అల్లరి నరేష్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకుడు. అన్నట్టు.. ఈ ఇంగ్లీష్ లెటర్ పోస్టర్స్ ప్రొమోషన్ ఐడియా వంశీదేనట!