మహేష్ రిలీజ్ చేసిన మిక్కీ టూర్ ప్రోమో!

0టెన్ ఇయర్స్ ఇండస్ట్రీ.. ఎన్నో చార్ట్ బస్టర్లు.. మనసుని తాకే మెలొడీస్.. మహేష్ బాబు సినిమాలనుండి మహానటి బయోపిక్కులకు పనిచేసి హిట్లిచ్చిన అనుభవం. అయినా ఏమాత్రం హంగామా ఉండదు. పని మాట్లాడాలి కానీ నోరు మాట్లాడకూడదు అన్నట్టుగా అయన పెద్దగా మాట్లాడడు కానీ ఆయన ట్యూన్స్ మాత్రం ఆయనకంటే ఎక్కువగా మాట్లాడతాయి. అయనే మిక్కీ జె మేయర్.

ఇప్పుడూ మిక్కీ జె మేయర్ తన టీమ్ తో పాటు నార్త్ అమెరికా మ్యూజిక్ టూర్ కి రెడీ అవుతున్నాడు. తన కెరీర్ లో ఇలా భారత దేశం వెలుపల లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం మిక్కీ కి ఇది మొదటి సారి. మికీ జె మేయర్ లైవ్ ఆన్ స్టేజ్ – నార్త్ అమెరికా 2019 టూర్ ప్రొమోను సూపర్ స్టార్ మహేష్ బాబు – స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు లు ఆవిష్కరించారు. ఒక నిముషం నిడివి ఉన్న ఈ ప్రమోలో మిక్కీ తన కెరీర్లో చేసిన కొన్ని హిట్ సాంగ్స్ ట్యూన్స్ వినిపిస్తాయి. తన బ్యాండ్ మెంబర్స్ తో కలిసి స్టేజ్ మీదకు రావడం కనిపిస్తుంది.

తను సంగీతం అందించే సినిమాలు సక్సెస్ఫుల్ అయినట్టే ఈ మ్యూజిక్ టూర్ కూడా విజయవంతం కావాలని ఆశిద్దాం. మరోవైపు మిక్కీ జె మేయర్ రీసెంట్ గా సంగీతం అందించిన ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా ఆడియో సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది.