ముందే హిట్టని తెలిసి తల ఎత్తారట!

0

భయపడి వెనకడుగు వేస్తే గెలవలేం! అని `మహర్షి` లోని బిజినెస్ మేన్ చెప్పిన డైలాగ్ ని ఇంకా ఎవరూ మర్చిపోలేదు. మహర్షి ట్రైలర్ జెట్ స్పీడ్ తో అంతర్జాలంలోకి దూసుకుపోయింది అంటే ఆ డైలాగ్స్ లో అంత పవరుందనే అర్థం. మే9న మహేష్- వంశీ పైడిపల్లి శ్రమ ఫలించే రోజు అంటూ అభిమానులంతా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈలోగానే మహేష్ – నమ్రత ఫ్యామిలీ విదేశీ టూర్ ముగించుకుని ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లోనూ బిజీగా ఉన్నారు.

తీరిక సమయంలో అలా ఏఎంబీ సినిమాస్ (గచ్చిబౌళి) థియేటర్ కి వెళ్లి ఇదిగో ఇలా ఇన్ సైడ్ ఇంటీరియర్ ని మరోసారి తెరిపారా చూస్తున్నారు. మాల్ లో జనాలు ఎలా ఉన్నారు? రద్ధీ ఎలా ఉంది? తాము భావించినట్టే ఇంటర్నేషనల్ ఫైవ్ స్టార్ హోటల్ యాంబియెన్స్ ని తలపిస్తోందా? ఇలా రకరకాల కోణాల్లో పరిశీలిస్తున్నారని అర్థమవుతోంది. ఈ ఫోటోకి నమ్రత ఓ ఆసక్తికర క్యాప్షన్ ని ఇచ్చారు. తల ఎత్తి చూడు.. ముందుకు చూడు.. ! అంటూ క్యాప్షన్ ఇచ్చారు. నేడు ఏఎంబీ మాల్ ని నిర్మించిన ఆదర్శ జంటగా మహేష్ – నమ్రత ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగేశారు. ఈ బిజినెస్ ని రాష్ట్రంలో అన్ని నగరాలకు విస్తరిస్తారనే అభిమానులు భావిస్తున్నారు.

ఇక ఈ లుక్ కి సోషల్ మీడియాలో అభిమానులు రకరకాల వ్యాఖ్యల్ని జోడించారు. మీరు మాజీ మిస్ యూనివర్శ్ అయ్యి ఉండీ మరీ ఇంత సింపుల్ గా ఎలా ఉంటారు? అని ఓ అభిమాని నమ్రతను ప్రశ్నించారు. రిలీజ్ ముందే సినిమా హిట్టు అని తెలిసి తల ఎత్తుకున్న అన్నా వదిన అంటూ వేరొక అభిమాని వ్యాఖ్యానించారు. ఏఎంబీ మాల్ మీ కంటే యంగ్ గా కనిపిస్తోంది! అంటు ఓ అభిమాని కొంటెగా వ్యాఖ్యను పోస్ట్ చేశాడు. రెండు ఆత్మలు .. నిజమైన స్ఫూర్తి! అన్న కామెంట్ ఆకట్టుకుంది. ఇంతకీ ఏఎంబీలో మహేష్ కి అవెంజర్స్ – ఎండ్ గేమ్ టిక్కెట్లు దొరకలేదని అన్నారు. ఇప్పటికైనా దొరికాయో లేదో.. ప్చ్!!
Please Read Disclaimer