మహేష్-సితార.. క్యూట్ మూమెంట్

0టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో ఏ విధంగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన పిల్లలను కలుసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కాస్త గ్యాప్ దొరికినా కూతురు సితార తోనే ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. టాలీవుడ్ లో బెస్ట్ డాడీ అవార్డులు పోటీ పెడితే మహేష్ టాప్ లో ఉంటాడని చెప్పవచ్చు. వారిద్దరికీ సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా వైరల్ అవుతున్నాయి.

ఇక మహేష్ సతీమణి నమ్రత వారిద్దరి హ్యాపీ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు అందంగా సెట్ చేసి సోషల్ మీడియాలో వదులుతారు. దీంతో సూపర్ స్టార్ అభిమానులు వాటికి మరింత బజ్ క్రియేట్ చేస్తారు. రీసెంట్ గా మహేష్ సీతారాతో ఉన్న ఒక క్యూట్ మూమెంట్ ని నమ్రత నెటిజన్స్ తో షేర్ చేసుకున్నారు. టేబుల్ దగ్గర ఓ వైపు మహేష్ మరో వైపు కూతురు సితార ఫన్నీగా హావభావాలను అనుకరిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్లిప్పింగ్ కొన్ని రోజుల క్రితం స్పెయిన్ లో తీసినది. అప్పుడు మహేష్ తన ఫ్యామిలీతో హాలిడేస్ ట్రిప్ ను ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇకపోతే ప్రస్తుతం సూపర్ స్టార్ తన 25వ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇటీవల డెహ్రూడున్ లో షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను దిల్ రాజు – అశ్విని దత్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక హీరోయిన్ గా మహేష్ సరసన పూజ హెగ్డే నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.