#మహేష్ 26: నూట యాభై కోట్లట!

0ఈమధ్య కాలంలో టాలీవుడ్లో టాప్ హీరోల సినిమాల బడ్జెట్ దాదాపుగా రూ. 70 కోట్ల నుండి 100 కోట్ల వరకూ ఉంటోంది. ఇక కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఆ బడ్జెట్ 150 కోట్లనుండి 200 కోట్లు కూడా టచ్ అవుతోంది. చిరంజీవి ‘సైరా’.. ప్రభాస్ ‘సాహో’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఇప్పుడు మహేష్ బాబు తాజా చిత్రం కూడా బడ్జెట్ విషయంలో షాక్ ఇచ్చేలానే ఉంది.

మహేష్ ప్రస్తుతం తన ల్యాండ్ మార్క్ 25వ చిత్రం ‘మహర్షి’ ని వంశి పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమా నెక్స్ట్ సమ్మర్ లో విడుదల అవుతుంది. ఈ సినిమా విడుదల అయ్యే లోపే మహేష్ తన 26 వ చిత్రాన్ని సుకుమార్ డైరెక్షన్ లో చేసేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాను సుకుమార్ బిగ్గెస్ట్ హిట్ ‘రంగస్థలం’ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కథాకథనాలపై సుకుమార్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా బడ్జెట్ పై ఓ ఇంట్రెస్టింగ్ విషయం బైటకి వచ్చింది.

ఈ సినిమాకు మైత్రీ వారిని సుక్కు రూ.150 కోట్ల బడ్జెట్ అడిగాడట. టెక్నికల్ యాస్పెక్ట్స్ విషయంలో రాజీ పడకుండా సినిమాను నిర్మించేందుకు ప్రముఖ టెక్నిషియన్స్ ను ఈ సినిమాకు తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట. దీంతో సినిమా బడ్జెట్ లో మేజర్ పార్ట్ హై క్వాలిటీ మేకింగ్ కు.. రెమ్యూనరేషన్స్ కే ఖర్చవుతుందని సమాచారం. సుక్కు ఇచ్చిన బడ్జెట్ ప్రపోజల్ కు మైత్రీ వారు కూడా సై అన్నారట. మహేష్ లాంటి స్టార్ హీరో.. సుక్కు లాంటి స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ అంటే బిజినెస్ ఎలాగూ అవుతుందని వారు కాన్ఫిడెంట్ గా ఉన్నారట. అంతా బాగానే ఉంది గానీ ఈ సినిమా బడ్జెట్ ప్రకారం బ్రేక్ ఈవెన్ కావాలంటేనే నాన్-బాహుబలి రికార్డులన్నీ బద్దలు కొట్టాలి…!