మహేష్ షూటింగ్ మధ్యలో ఆపేశారా?

0Bharat-Ane-Nenu-Lucknow-scheduleసూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు గ్యాప్ లేకుండా షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. దసరాకు రాబోతున్న స్పైడర్ సినిమా ఇప్పటికే అన్నీ సిద్దం చేసుకొని విడుదలకు ముస్తాబువుతోంది. కొన్ని పాటల రికార్డింగ్ లు తప్పితే ముఖ్యమైన ప్రొడక్షన్ పనులు అన్నీ పూర్తయ్యాయ్. అయితే ఇప్పుడు తన తదుపరి సినిమా ‘భరత్ అనే నేను’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు మహేష్. ఈ సినిమా కోసం షూటింగ్ పని మీద గొప్ప చరిత్ర కలిగిన లక్నో నగరానికి వెళ్లారు. కొన్ని యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.

అయితే ఈ షెడ్యూల్ ఇప్పుడు అనుకోని కొన్ని సమస్యలు వలన షూటింగ్ ఆగిపోయినట్లు టాక్. భరత్ అనే నేను సినిమాలో లక్నో సిటీ ఒక ముఖ్య భూమిక పోషించబోతోంది. సినిమా కథ బట్టి అక్కడ ఉన్న కొన్ని గొప్ప కట్టడాలు దగ్గర షూటింగ్ చేయవలిసి ఉంది. కానీ అర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కొన్ని పురాతన సంస్కృతిక కట్టడాలు వద్ద షూటింగ్ కి అనుమతి ఇవ్వడం కుదరదన్నారట. దానితో షూటింగ్ ప్లాన్ మార్చవలిసి వచ్చింది. షూటింగ్ లు జరగడం వలన ఆ కట్టడాలకు ఏమైనా నష్టం జరిగితే మళ్ళీ మేము గవర్నమెంట్ కు సమాధానం చెప్పుకోవలిసి ఉంటుంది కాబట్టి సారీ కుదరదు అని చెప్పారట. అందుకే షెడ్యూల్ మధ్యలోనే ఆగింది. అయితే ఈ సినిమా ప్రొడక్షన్ యునిట్ మాత్రం.. మేం షూటింగ్ దిగ్విజియంగా ముగించుకుని తిరిగి వస్తున్నాం అంటున్నారు.

భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ సుందరి కైరా అద్వానీ నటిస్తుంది. ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి గా కనిపించనున్నాడు. ఈ లక్నో షెడ్యూల్లో మహేశ్ బాబు తో పాటుగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా పాల్గొన్నాడు. డివివి దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీమంతుడు సినిమా డైరెక్టర్ కొరటాల శివనే ఈ సినిమాకు కూడా డైరెక్టర్.