మహేష్ సినిమాను కూడా వేసేస్తున్నారు

0ఒకప్పుడు సినిమాలు ఎన్ని రోజులు ఆడేవి అనే ఒక రికార్డ్ ఉండేది. 100 డేస్ అనే పోస్టర్స్ ఇప్పుడు కనిపించడమే లేదు. చూసిన సినిమా థియేటర్ కి వెళ్లి ప్రతి సారి చూసే ఓపిక జనాల్లో చాలా వరకు తగ్గింది. కానీ టీవీల్లో వస్తే మాత్రం అతుక్కుపోతారు. ఇక టెక్నాలిజీ పెరుగుతున్న కొద్దీ ఎదో ఒక విధంగా సినిమాలను మళ్లీ మళ్లీ చూసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎంత పెద్ద సినిమా విడుదలైన కూడా 50 రోజులకు ముందే వెబ్ మీడియాల్లో దర్శనమిస్తోంది.

ముఖ్యంగా వరల్డ్ లో అతిపెద్దదైన స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫార్మ్ అమేజైనే ప్రైమ్ లో ప్రస్తుతం చాలా సినిమాలు విడుదలైన కొన్ని రోజులకే వచ్చేస్తున్నాయి. ఇటీవల రంగస్థలం 50 రోజులు గడవకముందే వచ్చేసింది. ఇకపోతే అదే తరహాలో మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ భరత్ అనే నేను సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ లోకి మరికొన్ని రోజుల్లో రాబోతోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా మహేష్ కెరీర్ లో మంచి కలెక్షన్స్ అందించిన చిత్రంగా నిలిచింది.

జూన్ 9వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో భరత్ అనే నేను టెలి క్యాస్ట్ అవ్వనుంది. ఇప్పటికే యూ ట్యూబ్ లో విడుదలైన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే అన్ కట్ సీన్స్ కి కూడా ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఇంటర్నెట్ లో భరత్ అనుకున్నంత స్థాయిలో మెప్పిస్తాడో లేదో చూడాలి.