వంశీకి స్వీట్ విషెస్ చెప్పిన మహేష్

0సూపర్ స్టార్ మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ హిట్ తర్వాత సరికొత్త లుక్ తో భారీ బడ్జెట్ మూవీ తీస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం సెట్స్ పైన ఉంది. శుక్రవారం వంశీ పైడిపల్లి పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో హీరో మహేష్ బాబు తన యంగ్ డైరెక్టర్ వంశీకి అదిరిపోయే రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. సెట్ లో వంశీ తనతో నవ్వుతూ నడుస్తున్న ఫొటోను షేర్ చేసి బర్త్ డే విషెస్ తెలిపాడు.

మహేష్ బాబు ఈ ఫొటో లో గడ్డంతో.. ఆఫ్ షర్ట్ తో అదిరిపోయేలా ఉన్నాడు. పక్కనే డైరెక్టర్ వంశీ నవ్వుతూ మహేష్ ను అనుసరిస్తున్నాడు. ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోతో పాటు సెట్స్ నుంచి క్రికెట్ ఆడుతున్న ఫొటోలు కూడా విడుదలయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన మహేష్ నయా లుక్ ను ఆయన అభిమానులు తెగ షేర్లు చేస్తున్నారు.