కౌశల్ కోసం సూపర్ స్టార్ ట్వీట్.. అదిరింది!

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ క్రేజ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. సినిమా పరిశ్రమకు చెందిన వారు బిగ్ బాస్ గురించి పెద్దగా పట్టించుకోరు అనే వాదన ఉంది. కాని ఈసారి మాత్రం పలువురు సినీ ప్రముఖులు కౌశల్ కు మద్దతుగా మాట్లాడటంతో పాటు – విన్నర్ గా కౌశల్ నిలిచిన తర్వాత శుభాకాంక్షలు చెబుతున్నారు. ఎంతో మంది కౌశల్ కు అభిమానం అయిన నేపథ్యంలో సినీ ప్రముఖులు కూడా షాక్ అవుతున్నారు. కొందరు కౌశల్ అభిమానులను ఆనందింపజేసేందుకు కౌశల్ కు శుభాకాంక్షలు చెప్పేందుకు ముందుకు వస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది.

ఇక తాజాగా మహేష్ బాబు కూడా కౌశల్ కు శుభాకాంక్షలు చెప్పడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ట్విట్టర్ లో మహేష్ బాబు.. ఇది చాలా పెద్ద విజయం – నీ విజయానికి సంతోషంగా ఉంది – కౌశల్ నీకు నా అభినందనలు. నీ విజయాన్ని ఎంజాయ్ చేయి అంటూ ట్వీట్ చేశాడు. గతంలో మహేష్ బాబుకు కౌశల్ కు పరిచయం ఉంది. కౌశల్ సొంతంగా మోడలింగ్ సంస్థను ప్రారంభించిన సమయంలో మహేష్ బాబు దాన్ని ఆరంభించాడు.

మహేష్ బాబు హీరోగా ‘రాజకుమారుడు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అదే సినిమాతో కౌశల్ కూడా ప్రేక్షకులకు పరిచయం అయినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ తో బిగ్ బాస్ టైటిల్ రావడం కంటే ఎక్కువగా కౌశల్ సంతోషంగా ఉన్నాడు. కౌశల్ కోసం మహేష్ బాబు ట్వీట్ చేయడంతో కౌశల్ ఆర్మీ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొదటి సీజన్ విజేత శివబాలాజీ కంటే కౌశల్ కు డబుల్ క్రేజ్ దక్కిందనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.




Please Read Disclaimer