అతడికి చుక్కలు చూపించిన మహేష్ ఫ్యాన్స్..!

0సూపర్ స్టార్ మహేష్ బాబుపై తాజాగా తమిళ కమెడియన్ మనోజ్ ప్రభాకరన్ వివాదాస్పద కామెంట్స్ చేసిన విషయం తెల్సిందే. స్పైడర్ చిత్రంలో మహేష్ బాబు కంటే విలన్ గా నటించిన ఎస్ జే సూర్య బాగా నటించాడని – మహేష్ బాబుకు నటన సరిగా రాదనడంతో పాటు – బాలీవుడ్ హీరోయిన్ కత్రిన కైఫ్ కు మేల్ వర్షన్ మహేష్ అన్నాడు. బండరాయి మాదిరిగా మహేష్ ఉంటాడు అంటూ కూడా వివాదాస్పదంగా మనోజ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారంను రేపాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ ప్రారంభం అయ్యాయి.

మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో మనోజ్ ప్రభాకరన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. కొన్ని వేల కామెంట్స్ తో మనోజ్ సోషల్ మీడియా పేజ్ నిండిపోయింది. కొందరు డైరెక్ట్ గా కూడా ఫోన్ లు చేసి మనోజ్ ను దూషిస్తున్నట్లుగా తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మహేష్ బాబు విమర్శలకు మరియు పోస్ట్ లకు అల్లాడిపోయిన మనోజ్ ప్రభాకరన్ చివరకు సారీ చెబుతూ ఒక వీడియోను విడుదల చేశాడు. తాను మహేష్ బాబుపై వ్యక్తిగత ఉద్దేశ్యంతో విమర్శలు చేయలేదని – కేవలం తన తన వీడియో హైలైట్ అవ్వాలనే చేశాను అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

టాలీవుడ్ లో సూపర్ స్టార్ అయన మహేష్ బాబు ఈమద్య కాలంలో కోలీవుడ్ లో కూడా సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల తమిళనాట మహేష్ బాబు నటించిన పలు చిత్రాలు డబ్ అయ్యాయి. అక్కడ మహేష్ కు వస్తున్న క్రేజ్ ను చూసి ఓర్వలేక కొందరు ఇలా చీప్ ట్రిక్స్ ను ప్లే చేస్తున్నారు అంటూ అభిమానులు ఆరోపిస్తున్నారు. మనోజ్ ప్రభాకరన్ క్షమాపణలు చెప్పినా కూడా ఆయనపై ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. మహేష్ బాబును తమిళ సినిమా పరిశ్రమలోకి రాకుండా కొందరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.