శోభిత తర్వాత నాగార్జున వంతు!

0ఈ ఫ్యాన్స్ ఉన్నారే.. ఎప్పుడూ అంతే. ఎవరిమీద కోపం వస్తుందో ఎవరికీ తెలీదు. సుపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఈమధ్య ‘గూఢచారి’ బ్యూటీ శోభిత ను సోషల్ మీడియా లో ట్రోలింగ్ చేసిన విషయం తెలిసిందే. గారు సార్ లాంటి పదాలు వాడకుండా మహేష్ కు జస్ట్ ‘థ్యాంక్ యు’ చెప్పినందుకు ఆమె ట్రోలింగ్ బారిన పడాల్సి వచ్చింది. ఇప్పుడు మహేష్ అభిమానులు ‘కింగ్’ నాగార్జున చేసిన కామెంట్స్ కు అప్ సెట్ అయ్యారట.

నాగార్జున ఈమధ్య ‘గూఢచారి’ సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే కదా. నాగ్ కు సినిమా విపరీతంగా నచ్చడంతో ‘గూఢచారి’ టీమ్ పై – సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘గూఢచారి’ సినిమాను ‘శివ’ తో పోల్చాడంటే మనం నాగ్ కు ఎంతగా ఆ సినిమా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అదే ఫ్లో లో ఈ ఏడాది నిఖార్సైన హిట్లు మూడేనని అవి.. ‘రంగస్థలం’.. ‘మహానటి’.. ‘గూఢచారి’ అని ఒక కామెంట్ చేశాడు. దీనిపై కొంతమంది విమర్శించడం జరిగింది కూడా. ఎందుకంటే నాగ్ ‘భాగమతి’.. ‘ఛలో’.. ‘RX 100’ సినిమాల పేర్లను ప్రస్తావించలేదు.

కానీ మహేష్ అభిమానులు అప్సెట్ అయిన కారణం అది కాదు.. ‘భరత్ అనే నేను’ సినిమాను ప్రస్తావించకపోవడం వాళ్ళకు నచ్చలేదు. దీంతో వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. పక్కవారి సినిమాల ఫలితాల సంగతి మాట్లాడే ముందు ‘ఆఫీసర్’ సినిమా గురించి.. దాని అద్భుతమైన కలెక్షన్స్ గురించి మాట్లాడితే బాగుంటుందని సెటైర్లు వేస్తున్నారు. కొంతమంది ఇంకా దూరం కూడా వెళ్లారు. ఏదేమైనా ‘భరత్ అనే నేను’ హిట్ అనిపించుకున్నప్పటికీ అందరూ డిస్ట్రిబ్యూటర్లకు బయ్యర్లకు లాభాలు తీసుకురాలేదు. అందుకే నాగ్ మహేష్ సినిమా పేరు తీసుకురాలేదేమో. ఏదేమైనా అప్ సెట్ అయిన ఫ్యాన్స్ కు అవన్నీ పట్టవు కదా.