దాంతో మొదలు పెట్టిన సూపర్ స్టార్

0

మన స్టార్ హీరోలు సాధారణ ప్రేక్షకులతో కలిసి సినిమా చూడడం అనేది చాలా కష్టమైన విషయం. క్రౌడ్ ను కంట్రోల్ చేయడం కష్టం కాబట్టి కామన్ ఆడియన్స్ తో కలిసి సినిమా చూడరు. అందుకే టాప్ స్టార్స్ ఇళ్ళలో డిజిటల్ ప్రొజెక్షన్ చేసుకునేందుకు వీలుండే హోమ్ థియేటర్స్ ఉంటాయి. వారు సినిమా చూడాలనుకుంటే ఇంట్లోనే క్యూబ్ లాంటి డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి పాస్ కోడ్ తీసుకుని సినిమా చూస్తారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అంతే. మహేష్ ఎప్పుడైనా సినిమాను మెచ్చుకున్నాడంటే సినిమాను అలా చూసినట్టే.

మరి మహేష్ బాబుకు ఎఎంబీ సినిమాస్ లో భాగస్వామ్యం ఉంది కదా.. మరి ఇప్పుడు తన సొంత థియేటర్లలో సినిమా చూస్తున్నాడా? మహేష్ ఇప్పటివరకూ సినిమా చూడలేదు కానీ మొదటి సారిగా నిన్న ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ సినిమాను తిలకించాడట. ఈ విషయాన్ని తెలుపుతూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ఫోటో ను పోస్ట్ చేశాడు మహేష్. ”ఎఎంబీ సినిమాస్ లో నా ఫస్ట్ సినిమా. అవెంజర్స్: ఎండ్ గేమ్. సినిమా నచ్చింది.. ఇదో మంచి అనుభవం. థ్యాంక్ యూ టీమ్ ఎఎంబీ.” అంటూ ట్వీట్ చేశాడు. అఫోటోలో ఎఎంబీ స్టాఫ్ తో కలిసి పోజిచ్చాడు మహేష్.

ఇదిలా ఉంటే మరో మూడు రోజుల్లో మహేష్ బాబు ల్యాండ్ మార్క్ ఫిలిం ‘మహర్షి’ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ఓపెన్ చెయ్యడంతో జోరుగా టికెట్స్ బుకింగ్ జరుగుతోంది. టికెట్స్ హాట్ కేక్స్ లా అమ్ముడవుతూ ఉండడంతో ‘మహర్షి’ మొదటి రోజు రికార్డులు సవరించడం ఖాయమని అంచనాలు వెలువడుతున్నాయి.
Please Read Disclaimer