ఇంపార్టెంట్ డైరెక్టర్ ని మరిచాను!

0

రెండు దశాబ్ధాల కెరీర్ లో పాతిక సినిమాలు చేశారు మహేష్. సిల్వర్ జూబ్లీ(25వ సినిమా) మూవ్ మెంట్ ఇది. అందుకే `మహర్షి` వేదికపై ఆయనలో ఎంతో ఎమోషన్ కనిపించింది. దాచాలన్నా దాచుకోలేనంతగా ఉద్వేగానికి గురయ్యారు మహేష్. తన కెరీర్ కి బ్లాక్ బస్టర్లు ఇచ్చి కీలక మలుపు తిప్పిన దర్శకులందరినీ గుర్తు చేసుకున్నారు. అయితే అందులోనూ ఓ పొరపాటు చేసి సోషల్ మీడియాలో వాడి వేడి చర్చకు తావిచ్చారు.

ఇంతకీ మహేష్ మర్చిపోయిన ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు? అంటే… సూపర్ స్టార్ కెరీర్ కి కీలక మలుపునిచ్చిన `పోకిరి` దర్శకుడు పూరి జగన్నాథ్. ఇండస్ట్రీ రికార్డ్ బ్రేకింగ్ మూవీ పోకిరి. ఆ సినిమా మహేష్ కెరీర్ లో ఒక గొప్ప మలుపు. “ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ ఐపోద్దో……వాడే పండుగాడు.నేనే.. “.. “ఒకసారి కమిట్ అయ్యాక నా మాట నేనే వినను!!“ అంటూ మహేష్ చేత బ్లాక్ బస్టర్ డైలాగ్ ని చెప్పించారు పూరి. అందుకే ఆయన ఎప్పటికీ మర్చిపోలేని దర్శకుడు అభిమానులకు. “ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా“ “అన్నయ్యా ఈ తొక్కలో మీటింగ్ లు ఏమిటో అర్థంకావట్లేదు“.. “నేనెంత యదవనో నాకే తెలవదు“… ఇవన్నీ మహేష్ కోసమే పుట్టిన డైలాగులా అన్నట్టుగా రాశారు పూరి. అన్నట్టే ఆ సినిమా ఎంతటి సెన్సేషనల్ హిట్లో తెలిసిందే. ఇండస్ట్రీ తొలి 40కోట్ల క్లబ్ సినిమా పోకిరి అంతకుముందు ఉన్న అన్ని రికార్డుల్ని చెరిపేసిందని చెబుతారు.

అంత ఇంపార్టెంట్ డైరెక్టర్ ని మహేష్ పొరపాటున అయినా మర్చిపోకూడదని అభిమానులు సోషల్ మీడియాలో డిబేట్ రన్ చేయడం విశేషం. అయితే జరిగిన పొరపాటు నుంచి మహేష్ వెంటనే రియలైజ్ అయ్యారు. స్పీచ్ ఇచ్చిన కాసేపట్లోనే ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. “ఈరోజు నా స్పీచ్ లో ఒక ముఖ్యమైన వ్యక్తిని మర్చిపోయాను. నా 25 సినిమాల జర్నీలో నన్ను సూపర్ స్టార్ ని చేసింది పోకిరి. ఆ సినిమాని ఇచ్చిన పూరీకి ధన్యవాదాలు. ఎప్పటికీ మర్చిపోలేని సినిమా అది“ అని ట్వీట్ చేశారు.

ఈ పాతిక సినిమాల జర్నీలో నేను థాంక్స్ చెప్పుకోవాల్సిన డైరెక్టర్స్ చాలా మందే ఉన్నారు… అంటూ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు- కృష్ణవంశీ- గుణశేఖర్- త్రివిక్రమ్-శ్రీనువైట్ల- కొరటాల అందరి పేర్లు తలచుకున్నారు మహేష్. 25వ సినిమా చేస్తున్న వంశీ పైడిపల్లి తన సొంత తమ్ముడు అని పొగిడేసిన సంగతి తెలిసిందే. చేసిన తప్పును గుర్తించి వెంటనే పూరి గురించి సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజెప్పడం గొప్ప రియలైజేషన్ గా భావించవచ్చు.
Please Read Disclaimer