మహేష్ సడెన్ టూర్ సర్ ప్రైజ్

0ఇలా సందు దొరకగానే అలా టూర్ పేరుతో షికార్లు చేసేయడం మహేష్ కి కుదిరినంతగా వేరెవరికీ కుదరదేమో! ఓవైపు సినిమాల షూటింగులతో – యాడ్ షూట్లతో బిజీబిజీగానే కనిపిస్తాడు. ఈలోగానే ఫ్యామిలీ ట్రిప్ అంటూ విదేశాలకు చెక్కేస్తుంటాడు. ఎప్పటికెయ్యది అప్పటికా పని చేయ సజ్జనుడు సుమతీ! అన్నచందంగా మహేష్ ఫ్యామిలీ లైఫ్ ని – ప్రొఫెషనల్ లైఫ్ ని సవ్యంగా నడిపించేస్తున్నాడు. ఇదివరకూ స్పైడర్ – భరత్ అనే నేను రిలీజ్ సమయంలో మహేష్ ఫ్యామిలీ ట్రిప్స్ గురించి తెలిసిందే. `భరత్ అనే నేను` రిలీజ్ తర్వాత రెండు సార్లు విదేశాల్లో ఫ్యామిలీ సమేతంగా ఆస్వాధనలకు వెళ్లాడు.

ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కెరీర్ 25వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా బిజీలోనే అభిబస్ యాడ్ చేస్తున్నాడంటూ వార్తలొచ్చాయి. కొరటాల ఈ ప్రకటనకు దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు ఆగస్టు 9న బర్త్ డే సంబరాల కోసం అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఎవరి ప్లాన్స్ లో వాళ్లు బిజీగా ఉన్నారు. ఆగస్టు 13 నుంచి గోవా షెడ్యూల్ అన్న వార్త అందింది. ఈలోగానే ఉన్నట్టుండి షార్ట్ గ్యాప్. ఈ గ్యాప్ లోనే మహేష్ `ఇట్స్ రిలాక్స్ టైమ్` అంటూ బర్త్ డే సందర్భంగా ఫ్యామిలీతో ఓ చిన్న ట్రిప్ ప్లాన్ చేశాడట. 25వ సినిమా టైటిల్ లాంచ్ – ఫస్ట్ లుక్ లాంచ్ అంటూ ప్రిపరేషన్స్ సాగుతుండగానే ఇలా సర్ ప్రైజ్ ప్లానింగ్.

అదిరిందయ్యో చంద్రం అన్న తీరుగా అప్పటికప్పుడు ఈ సడెన్ ప్లాన్స్ ఏంటో కానీ సూపర్ స్టార్ వైఖరి సంథింగ్ స్పెషల్ అని చెప్పాలి. బర్త్ డే వేళ ఫ్యామిలీకి చిన్నపాటి సర్ ప్రైజ్ ఇవ్వాలని ఇలా ప్లాన్ చేశాడని భావించవచ్చు. ఇకపోతే కుటుంబ సమేతంగా అంటే నమ్రత – గౌతమ్ – సితార ఈ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. మహేష్ `రిషి` (ప్రకటించబోయేది) చిత్రం ఏప్రిల్ 5న ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. డార్జిలింగ్ షెడ్యూల్ తర్వాత ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్ ని తెరకెక్కించి తదుపరి గోవా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.