మ‌హేష్ హ్యాట్రిక్‌!

0

Mahesh-babu-Hatrickగ‌త రెండేళ్లుగా సంక్రాంతి హీరో అనిపించుకొన్నాడు మ‌హేష్‌. బిజినెస్‌మేన్‌, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమాల్ని సంక్రాంతికి విడుద‌ల చేశారు. ఆ రెండూ మంచి విజ‌యాల‌ను అందుకొన్నాయి. ముచ్చట‌గా మూడోసారి సంక్రాంతికి వ‌స్తున్నాడు. మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 1ని సంక్రాంతి పండ‌గ సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 10న విడుద‌ల చేయ‌నున్నారు. సుకుమార్ దర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ తెర‌కెక్కిస్తోంది. లండ‌న్ షెడ్యూల్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం రెండో టీజ‌ర్‌ని ఇటీవ‌లే విడుద‌ల చేశారు. తొలి మూడు రోజుల్లోనే ప‌దిల‌క్షల క్లిక్స్ వ‌చ్చాయ‌ట‌. అదో రికార్డని చిత్రబృందం చెబుతోంది.