మహేష్ అల్లరికి ఇదే నిదర్శనం

0సూపర్ స్టార్ మహేష్ బాబు ఎవరితో ఎక్కువగా మాట్లాడడని – ఆయన షూటింగ్ లో తన పనేదో తాను చూసుకుని వెళ్తాడు అంటూ గతంలో టాక్ ఉండేది. కొన్ని సంవత్సరాలకు ముందు మహేష్ అలాగే ఉండేవాడని సినీ వర్గాల వారు కూడా కొందరు అంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం మహేష్ లో చాలా మార్పు వచ్చింది. షూటింగ్ సమయంలో సెట్స్ లో ఉన్న వారందరితో కూడా సరదాగా టైంను గడపడటంతో పాటు – తోటి నటీనటులతో జోకు వేస్తూ – వారిని ఆటపట్టిస్తూ ఉంటాడట. ఈ మద్య కాలంలో ఆయనతో వర్క్ చేసిన పలువురు ఇదే విషయాన్ని చెబుతూ వస్తున్నారు. మహేష్ తో వర్క్ చాలా జాయ్ ఫుల్ గా సాగుతుంది అంటూ చెప్పుకొచ్చారు. వారి మాటలకు ప్రత్యక్ష సాక్ష్యం అన్నట్లుగా తాజాగా ఒక లీక్ వీడియో నిలిచింది.

ప్రస్తుతం మహేష్ బాబు తన 25వ చిత్రం ‘మహర్షి’లో నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో కీలక పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ సందర్బంగా మహేష్ బాబు – అల్లరి నరేష్ తో చాలా ఫ్రెండ్లీగా – జోవియల్ గా ఉంటున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతూ ఉన్నారు. తాజాగా లీక్ అయిన వీడియోలో మహేష్ బాబు అల్లరి నరేష్ ను టీజ్ చేస్తున్నట్లుగా ఉంది. ఇది షూటింగ్ కు సంబంధించినది కాదు.

ఇటీవల అల్లరి నరేష్ బర్త్ డేను చిత్ర సెట్స్ లో మహేష్ బాబు స్వయంగా నిర్వహించడం జరిగింది. ఆ సందర్బంగా ఈ వీడియో తీసినట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు రియల్ బిహేవియర్ అంటూ సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. మహేష్ బాబు అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. మహేష్ బాబు 25వ చిత్రం ‘మహర్షి’ చిత్రం వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.