మళ్లీ పోకిరి మేజిక్కా మహేషూ..

0మహేష్ బాబును డిఫరెంట్ గెటప్స్ లో చూడడం కాస్త అరుదుగానే జరుగుతుంది. అంటే.. సినిమాల్లో ప్రయోగాలు చేస్తుంటాడు కానీ.. తన గెటప్ విషయంలో మాత్రం పెద్దగా మార్పులు తెచ్చుకునేందుకు ఇష్టపడడు.

ముఖ్యంగా హెయిర్ స్టైల్ విషయంలో అయితే.. మహేష్ తీరు మరీ మూసగా ఉందని ఫ్యాన్స్ కూడా విమర్శిస్తున్నారు. సూపర్ స్టార్ తన హెయిర్ స్టైల్ మార్చుకోవాలని చాలామందే రిక్వెస్టులు పెడుతూ ఉన్నారు. ఇప్పటికి వారిని మహేష్ కనికరించబోతున్నాడనే సంగతి ఇప్పుడు లీక్ అయింది. రీసెంట్ గా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మహేష్ అండ్ ఫ్యామిలీ క్రికెట్ మ్యాచ్ చూస్తున్న ఫోటోను ఆయన భార్య నమ్రత ట్వీట్ చేసింది. ఇందులో మహేష్ వెనుక వైపు నుంచి కనిపిస్తున్న మాట నిజమే కానీ.. మన స్టార్ హీరో హెయిర్ స్టైల్ అయితే మారిందనే సంగతి అర్ధమవుతుంది.

పైగా ఇది రఫ్ లుక్ అనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. ఇలా మహేష్ బాబు కంప్లీట్ గా గెటప్ మార్చుకుని రఫ్ లుక్ లోకి చేరడం.. గతంలో రెండు సార్లు జరిగింది. మొదగా పోకిరి కోసం తనను తాను మార్చుకున్నాడు మహేష్. ఇది అప్పటివరకూ ఉన్న రికార్డులను దులిపేసింది. ఆ తర్వాత అతిథి చిత్రం కోసం కూడా హెయిర్ స్టైల్ మార్చి ట్రై చేశాడు కానీ.. ఇది అంతగా వర్కవుట్ కాలేదు. మళ్లీ ఇప్పుడు తనను తాను ఛేంజ్ చేసుకుని.. పోకిరి డేస్ ను గుర్తు చేస్తున్నాడు సూపర్ స్టార్.