మహేష్ కొత్త కార్ నెంబర్ ఎంతో తెలుసా?

0Mahesh-Babu-in-RTA-Officeసౌత్ లో టాప్ హీరోలతో ఒకరిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ పని చేసినా సెన్సేషన్ అని చెప్పాలి. ఎటువంటి వివాదాలను దరి చేరనివ్వకుండా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండడంతో మహేష్ చేసే ప్రతి పనీ సమాజంలో ఎదో ఒక సెన్సేషన్ ని క్తియేట్ చేస్తుందన్న విషయం ఆయనకు తెలుసు సో అప్పుడప్పుడు బాధ్యత గల పౌరుడిగా తన వ్యక్తిత్వాన్ని చాటుకుంటారు.

మొన్నటి వరకు షూటింగ్ లలో బిజీగా ఉన్న మహేష్ రీసెంట్ గా ఒక కొత్త కారును కొనుగోలు చేశాడు. అయితే కారు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి సాధారణంగా స్టార్ హీరోస్ వెళ్ళడానికి అంతగా ఆసక్తి చూపారు. కానీ మహేష్ మాత్రం ఒక సాధారణ పౌరుడిలాగా కారు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కొత్తగా కొన్న తన కారును స్వయంగా నడుపుకుంటూ ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ వరకు వెళ్లారు. 1 కోటీ 50 లక్షలు రూపాయలు విలువ గల టయోటా ల్యాండ్ కారుకి అధికారులు TS 09 EV 4005 నెంబరును కేటాయించినట్లు చెప్పారు. అందుకోసం మహేష్ వేలి ముద్రాలను కూడా ఇచ్చారు.

ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అలాగే మహేష్ బయోమెట్రిక్ ఇవ్వడం వంటి ఫోటో కూడా అభిమానులు కు తెగ నచ్చేసింది. ఇక ఇప్పటికే స్పైడర్ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.