ముఖ్యమంత్రి అయినా మహేష్ మారలే

0ఎవర్ గ్రీన్ అందంతో మెరిసిపోవడంలో టాలీవుడ్ లో మహేష్ బాబు తర్వాతే ఎవరైనా. ఏజ్ ఎంతగా పెరుగుతున్నా.. క్యూట్ యంగ్ లుక్స్ లో కట్టి పడేస్తుంటాడు. అలాగే లుక్ విషయంలో రకరకాల ప్రయోగాలు చేయడానికి ఇష్టపడని హీరోల్లో కూడా ఈ సూపర్ స్టార్ పేరు ఫస్ట్ లోనే వినిపిస్తుంది.

అప్పుడెప్పుడో పోకిరి.. అతిథి వంటి సినిమాల్లో మినహాయిస్తే.. తన ఏ సినిమాలో అయినా ఒకటే లుక్ ని మెయింటెయిన్ చేస్తాడు మహేష్ బాబు. తన తోటి హీరోలంతా లుక్స్ తో పలు ప్రయోగాలు చేసి ఆకట్టుకునే ప్రయత్నం చేసినా.. మహేష్ మాత్రం ఈ విషయంలో చాలా సిన్సియర్ అండ్ స్ట్రిక్ట్ అనే చెప్పాలి. ఇప్పుడు మురుగదాస్ తో తీస్తున్న స్పైడర్ మూవీలో కూడా కాస్ట్యూమ్స్ మినహాయిస్తే.. పెద్దగా వేరియేషన్ చూపించలేదనే సంగతి ఇప్పటికే తెలిసిపోయింది. దీని తర్వాత కొరటాల శివతో సినిమాను కూడా మొదలుపెట్టేశాడు మహేష్.

భరత్ అనే నేను అనే టైటిల్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి.. ప్రస్తుతం షూటింగ్ స్టార్ట్ అయిపోయింది కూడా. షూటింగ్ స్పాట్ పిక్స్ ను చూస్తే.. ఈ మూవీలో కూడా మహేష్ బాబు తన పాత లుక్ తోనే.. టీషర్ట్ కనిపిస్తున్నాడని అర్ధమవుతుంది. అయితే.. ఇది సీఎం లుక్ కాకపోవచ్చులే. అంతకు ముందు జరిగే కథలో మహేష్ ఇలా ఉంటాడన్న మాట. కనీసం ముఖ్యమంత్రి గెటప్ కోసం అయినా.. మహేష్ బాబు వేరియేషన్ చూపిస్తాడో లేదో చూడాలి.Mahesh-babu-Look-in-Bharat-Anu-Nenu-movie